టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాబాయ్ – అబ్బాయ్ అనగానే బాలకృష్ణ(Balakrishna ) – ఎన్టీఆర్(NTR ) గుర్తొస్తారు. ఆ తర్వాత అంతే స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్న బాబాయ్ అబ్బాయ్ ఎవరంటే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)- రామ్ చరణ్ (Ram Charan) పేర్లు ప్రధమంగా వినిపిస్తాయి. ముఖ్యంగా వీరిద్దరూ పేరుకే బాబాయ్ – అబ్బాయ్..కానీ సన్నిహితులుగా ఉంటారన్న విషయం ఎన్నోసార్లు ఎన్నో స్టేజ్ లపై వెల్లడించారు. ముఖ్యంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనకు పాకెట్ మనీ కోసం డబ్బులు ఇస్తే.. ఆ డబ్బును తన బాబాయ్ పవన్ కళ్యాణ్ వాడుకునే వారని సరదాగా చెప్పుకొచ్చారు రామ్ చరణ్. అంతే కాదు తనకు కష్టం వచ్చినా.. సంతోషం కలిగినా.. ప్రతి అంశాన్ని ఒక ఫ్రెండ్ లాగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ వింటారని.. తనకు అండగా నిలుస్తారని రామ్ చరణ్ ఎన్నో సందర్భాలలో తెలిపారు.
ఓకే ఫ్రేమ్లో బాబాయ్ – అబ్బాయ్..
ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్(RRR ) సినిమా తర్వాత నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ సినిమాని వచ్చే యేడాది జనవరి 10వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ (S.Shankar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు మరొకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో నటిస్తూనే.. రాజకీయాలలోకి అడుగుపెట్టి నిర్విరామ శ్రమ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇకపోతే ఇద్దరూ ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత ఒకే ఫ్రేమ్లో కనిపించాలని మెగా అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్..
ఇప్పుడు అభిమానుల ఎదురుచూపుకి తెరదించుతూ.. రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించబోతున్నారట. గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు (Dilraju)భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంతే ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. ఏపీలోని తాడేపల్లిగూడెం, రాజమండ్రి, కాకినాడలలో ఏదో ఒక ప్లేస్ ను ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు తెలిసింది.
అభిమానుల కల నెరవేరబోతోందా..
ఇకపోతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యత చేపట్టిన తర్వాత తొలిసారి స్టేజిపై కనిపించబోతున్నారు. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ స్టేజ్ పై కనిపించాలని కోరుకున్న అభిమానులకు, ఇది పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో కియారా అద్వానీ (Kiara advani)మరోసారి రామ్ చరణ్ సరసన జతకట్టింది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘వినయ విధేయ రామ’ సినిమా వచ్చి డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. మరి ఈసారి ఏ మేరకు విజయం అందుకుంటుందో చూడాలి.