Visakha Crime News: వారిద్దరు భార్యభర్తలు. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కాకపోతే భర్త వీక్‌నెస్ ఆలస్యంగా భార్యకు తెలిసింది. మారాలని ఎన్నోసార్లు చెప్పింది. అయినా మానలేకపోయాదు. అడెక్ట్ అయిపోయాడు. ఏకాంత వీడియోకు బానిసైన భర్తను మార్చడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఆ ఇల్లాలు. చివరకు భర్త మారకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. సంచలన రేపిన ఈ ఘటన విశాఖ సిటీలో చోటు చేసుకుంది.
కొత్త దంపతుల కథ
విశాఖ సిటీ గోపాలపట్నం ప్రాంతానికి కొత్త దంపతుల కథ ఇది. సరిగ్గా 11 నెలల కిందట వసంత అనే యువతి.. నాగేంద్రబాబుని మ్యారేజ్ చేసుకుంది. పెద్దలు కుదుర్చిన పెళ్లి కావడంతో అంతా లాంఛనాలతో తమ కూతుర్ని అత్తింటికి పంపారు. అసలే ఈ రోజుల్లో యువతి యువకులు ఫాస్ట్‌గా ఉంటారు. ఏదైనా విషయాన్ని వేగంగా అర్థం చేసుకుంటారు. అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు.
మొదట్లో ఈ దంపతులు చూడముచ్చటగా ఉండేవారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేక పోయేవారు. అభిరుచులు, ఆలోచనలు ఒకటయ్యాయి. ఆ తర్వాత భర్తలో గుణాలు ఒకొక్కటిగా బయటకు రావడం మొదలైంది. నాగేంద్రబాబు వ్యసనం ఏంటో తెలుసా? ఏకాంత వీడియోలను నిత్యం చూసేవాడు. ఆ విధంగా తన లైఫ్ ఉండాలని కోరుకునేవాడు. రీల్‌కు రియల్‌కు తేడా తెలుసుకోలేక పోయాడు.
కోటి ఆశలతో అడుగుపెట్టిన ఆమెకు ఏ మాత్రం ఆనందం పడిన సందర్భాలు లేవు. ఏకాంత వీడియోలు మాదిరిగా తనను సంతోష పెట్టాలని భార్యను కోరేవాడు. ఆ తరహా వీడియోలకు బానిసగా మారాడు భర్త. రోజు రోజుకూ భార్యను ఆ విధంగా టార్చర్ పెట్టేవాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. చివరకు ఇలాంటి భర్తతో జీవితమంతా నరకం చూసే బదులు లేకపోవడమే బెటరని అంచనాకు వచ్చింది.
ALSO READ: నారాయణగూడలో చోరీ.. రూ.2 కోట్ల విలువైన ఆభరణాలతో ఉడాయించిన ఆ ఇంటి పనివాళ్లు!
రీల్ వేరు.. రియల్ వేరు
చివరకు సూసైడ్ చేయాలనే ఆలోచనకు వచ్చింది. అనుకున్నట్లుగానే స్లీపింగ్ మాత్రలు తీసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ వ్యవహారం బయటకు తెలియడంతో పోలీసుల చెవిలో పడింది. వెంటనే అక్కడకు చేరుకున్న గోపాలపట్నం పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. తమ అమ్మాయి ఆ విధంగా చూసి ఆగ్రహంతో రగిలిపోయారు పేరెంట్స్. కన్నీరుమున్నీరు అయ్యారు.అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని ఆమె భర్త చంపేశాడని చెప్పుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. అసలే టెక్ యుగం.. అరచేతిలో స్మార్ట్ ఫోన్ విప్లవం. ప్రపంచంలో వింతలు, విశేషాలు తెలుసుకోవచ్చు. కానీ, అలాంటి ఏకాంత వీడియోలకు బానిస కావద్దు. రాబోయే యువతకు ఇదొక గుణపాఠం లాంటిది.. తస్మాత్ జాగ్రత్త.