BigTV English
Advertisement

Vishwak Sen : పెద్ద హీరోలతో తిరగడం కాదు… పెద్ద సినిమాలూ చేయాలి..

Vishwak Sen : పెద్ద హీరోలతో తిరగడం కాదు… పెద్ద సినిమాలూ చేయాలి..

Vishwak Sen..ప్రముఖ హీరోగా, దర్శకుడిగా, రచయితగా తనకంటూ మంచి పేరు దక్కించుకున్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). వరుస చిత్రాలతో మంచి పేరు దక్కించుకున్న ఈయన తాజాగా లేడీ గెటప్ లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లైలా (Laila). స్టార్ హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా.. తన అందంతో అందరిని కట్టిపడేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా తాను వేసిన లేడీ గెటప్ కంటే విశ్వక్ వేసిన లేడీ గెటప్ చాలా బాగుంది అని ప్రశంసలు కురిపించారు .ఇక అలా అందరి అంచనాలను అందుకుంటూ ఫిబ్రవరి 14వ తేదీన ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా లైలా సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.. ఇప్పటివరకు విశ్వక్ కెరియర్ లో ఇలాంటి చెత్త సినిమా రాలేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


లైలా మూవీకి డిజాస్టర్ కష్టాలు..

ముఖ్యంగా ఈ సినిమా కంటెంట్ చెత్తగా అనిపించడమే కాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ రాజ్ (Prudhvi Raj) చేసిన కామెంట్లు, ఆ తర్వాత హీరో విశ్వక్ సేన్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోస్ట్ చేయడం అన్నీ కూడా అటు అల్లు ఇటు వైసీపీ అభిమానులను పూర్తిస్థాయిలో ఆగ్రహానికి గురిచేసాయి ఈ నేపథ్యంలోనే #BoycottLaila, #DisasterLaila అంటూ సినిమాను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. దీంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో..పెద్ద హీరోలతో తిరగడం కాదు… పెద్ద సినిమాలూ చేయాలి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


పెద్ద హీరోలతో తిరగడం కాదు.. పెద్ద సినిమాలు చేయాలి..

ఒకరకంగా చెప్పాలి అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎంతో కసి, పట్టుదలతో సినిమాలను తెరకెక్కించేవారు. కానీ ఈ మధ్య ఆయన చేస్తున్న సినిమాలేవి కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. సినిమా ఆడియన్స్ ని మెప్పించడం అటు ఉంచితే కాంట్రవర్సీ కారణంగా ఈయన సినిమాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా తన సినిమాలతో ఏదో నడిపిస్తూ పెద్ద పెద్ద హీరోలతో మాత్రం స్నేహం చేస్తున్నాడు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), బాలకృష్ణ (Balakrishna) లను తన సినిమాల కోసం బాగా వాడుకున్న విశ్వక్ సేన్ , ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) ని కూడా తన సినిమా కోసం వాడేసుకున్నారు. తన సినిమా కోసం వాడుకుంటున్న పెద్ద పెద్ద హీరోలంతా కూడా మంచి సినిమాలు చేస్తుంటే, విశ్వక్ మాత్రం సినిమాలతో నిరాశ పరుస్తున్నాడు. అందుకే పెద్ద పెద్ద హీరోలతో తిరగడం, పార్టీలు చేసుకోవడం తప్పుకాదు కానీ పెద్ద సినిమాలు కూడా చేయాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇకనైనా విశ్వక్ సేన్ కాస్త కళ్ళు తెరిచి, పెద్ద హీరోలు సపోర్టుగా ఉన్నారు అనే విషయాన్ని పక్కన పెట్టి, తన వంతు కష్టపడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా తనకు అంతా అండగా ఉంది అనే భ్రమ నుండి బయటకు వచ్చి మళ్లీ మంచి కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తాడో లేదో చూడాలి. ఏది ఏమైనా పెద్ద పెద్ద హీరోలు వచ్చినా. విశ్వక్ సేన్ అదృష్టాన్ని మాత్రం మార్చలేకపోయారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×