Vishakapatnam Crime: తన క్షణిక ఆనందం కోసం.. నవ మాసాలు మోసి పెంచి పోషించిన కన్న తల్లినే హతమార్చాడు ఓ కసాయి కొడుకు. కేవలం ఆన్‌లైన్ గేమ్స్ వద్దని మందలించినందుకు కన్న తల్లినే కడతేర్చేశాడు. కత్తితో విచక్షణ రహితంగా ఆన్‌లైన్ గేమ్స్ వద్దని దాడి చేసి చంపేశాడు. విశాఖ జిల్లాలోని మల్కాపురం పీఎస్ పరిధిలో ఈ దారుణం జరిగింది. కోస్ట్ గార్డ్ కమాండెంట్‌గా పనిచేస్తున్న బల్బీర్ సింగ్ ఫ్యామిలీగా గుర్తించారు.
అసలేం జరిగిందంటే.. విశాఖ జిల్లా నేవీ మల్కాజిపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సముద్ర తీర ప్రాంతం నేవి ఏరియా కోస్ట్ క్వాటర్స్‌లో ఆమె మృతిదేహాన్ని కొందరు గుర్తించారు. అనంతరం పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్తలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతురాలు శరీరంపై పలు గాయాలతో రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. మృతురాలు భర్త ఇండియన్ నేవి అధికారిగా గుర్తించారు. అనంతరం మృతిదేహాన్ని పోలీస్టేషన్‌కు తరలించారు.
కొడుకు విపరీతంగా ఆన్‌లైన్ గేమ్స్ బానిసకావడంతో.. వద్దని తల్లి మందలించిది. మొబైల్, ల్యాప్‌టాప్ లాక్కుంది. దీంతో కోపంతో రగిలిపోయిన కుమారుడు.. పక్కనే ఉన్న కత్తి తీసి తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. కొడుకు దాడిలో తల్లి అల్కా సింగ్ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో భయపడి అక్కడ నుంచి పారిపోయాడు కొడుకు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
సభ్యసమాజం తలదించుకునే ఘటనలు ఒకప్పుడు చాలా అరుదుగా జరిగేవి. రోజులు మారుతున్నకొద్దీ దారుణ ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దాంతో.. సమాజంలో సభ్యత, సంస్కారం అనే పదాలు ఎప్పుడో కనుమరుగైపోయాయి. మొత్తం సమాజాన్నే తలెత్తుకోకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ మీర్‌పేటలో గురుమూర్తి లాంటి కిరాతకుడు భార్యను చంపి.. ఆమె మృతదేహాపు ఆనవాళ్లని చెరువులో కలిపేసిన ఘటన.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం యావత్ భారతదేశంలోనే సంచలనం సృష్టించింది. అలాంటి ఘటనే.. నిజామాబాద్ జిల్లాలోనూ జరగడం కలకలం రేపింది. ఇప్పుడు ఆన్ లైన్ గేమ్స్ కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేసిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఇకపై.. ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోననే ఆందోళన రేకెత్తిస్తోంది.
Also Read: 5 పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ వైద్యురాలు.. సోషల్ మీడియాతో ఆటకట్టు
అసలు.. వీళ్లు ఇంత కర్కశంగా ఎందుకు మారుతున్నారు? ఇంత కిరాతకంగా హత్యలు ఎలా చేయగలుగుతున్నారు? భార్యల్ని, తల్లుల్ని హతమార్చి.. చెరువుల్లో పడేద్దామనే దుర్మార్గపు ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? ఈ ప్రశ్నలే అందరి మెదళ్లలో మెదులుతున్నాయి. కారణాలేవైనా, పరిస్థితులు ఎంత దారుణమైనవైనా.. నమ్మి వచ్చిన భార్యని.. కనీ పెంచిన తల్లిని చంపాలనే ఆలోచన ఎందుకొస్తోంది. ఈ తరహా ఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తాయి. ఇక ముందైనా.. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని అంతా కోరుకుంటున్నా.. అదెంతవరకు సాధ్యమవుతుందనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే.. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రిని కాల్వలోకి తోసి చంపేసాడు కొడుకు. నూజెండ్ల గ్రామానికి చెందిన గంగినేని కొండయ్యకు ఇద్దరు కొడుకులు. మొదటి కుమారుడు వెంకటేశ్వర్లు నూజెండ్లలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నాడు. తండ్రి కొండయ్య ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దారిలో మూత్ర విసర్జన దిగిన కొండయ్యను భద్రుపాలెం సమీపంలోని సాగర్ కెనాల్లో వెంకటేశ్వర్లు తోసేసాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.