BigTV English
Advertisement

Varalakshmi Sarath Kumar: మొదట్లో అవమానించారు.. ఇప్పుడు అదే నా కెరియర్ కు ప్లస్ అయ్యింది..!

Varalakshmi Sarath Kumar: మొదట్లో అవమానించారు.. ఇప్పుడు అదే నా కెరియర్ కు ప్లస్ అయ్యింది..!

Varalakshmi Sarath Kumar:ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sarathkumar).. ఈమధ్య ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ భారీగా పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలు చేస్తూ, ఆ హీరోలకు లక్కీ లేడీగా మారిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇదిలా ఉండగా గత 12 సంవత్సరాల క్రితం హీరోయిన్ అంజలి(Anjali), హీరో విశాల్ (Vishal) తో కలిసి నటించిన చిత్రం ‘మదగజరాజా’. అయితే ఈ సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ సుందర్ సి(Sundar.C) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళంలో మాత్రమే విడుదలై, భారీ విజయాన్ని అందుకుంది.ఇక ఈరోజు తెలుగులో కూడా విడుదలయ్యింది. ఇకపోతే 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యి, అందులోను బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టడంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఎదురు చూడగా.. ఆ ఎదురుచూపుకి కాస్త బ్రేక్ పడిందని చెప్పవచ్చు.


నా వాయిస్ బాగోలేదన్నారు..

ఇకపోతే ఈ సినిమా ఈరోజు విడుదలైన నేపథ్యంలో చిత్ర బృందం వరుస ప్రమోషన్స్ చేపట్టింది. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్ మొదట్లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..” నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నా వాయిస్ గురించి ఎంతోమంది కామెంట్లు చేసేవాళ్లు. ఈ వాయిస్ తో ఎలా చేస్తావో.. ఎవరో ఒకరిని డబ్బింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది.. అంటూ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు నా వాయిస్ నా కెరియర్ కు ప్లస్ అయింది. ఒకసారి అదే అనిపిస్తుంది నెగిటివ్ అనుకున్నదే ప్లస్ అవుతుంది అని” అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. మొత్తానికైతే వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న అవమానాలు, ఇబ్బందుల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.


సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్..

ఇకపోతే ఎప్పుడూ విలన్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మైథాలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ డైరెక్టర్ సంజీవ్ మేగోటి (Sanjeev megoti) దర్శకత్వంలో ఈ సినిమా రూపు దిద్దుకుంటున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియనున్నాయి.

వరలక్ష్మి శరత్ కుమార్ వ్యక్తిగత జీవితం..

తనకంటే వయసులో చాలా పెద్దవాడైన నికోలయ్ సచ్ దేవ్(Nicholai sachdev) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇక ఇతడికి అప్పటికే వివాహం జరిగి పెళ్లీడుకొచ్చిన కూతురు కూడా ఉంది. అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవడంతో వరలక్ష్మి శరత్ కుమార్ పై కూడా కొంతమంది విమర్శలు గుప్పించారు .ఈమె అభిమానులైతే పూర్తి స్థాయిలో హర్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఇంకొంతమంది మనసుకు నచ్చితే వయసుతో సంబంధం లేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఏది ఏమైనా వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం వ్యక్తిగతంగా ఇలాంటి విమర్శలు ఎదుర్కొందని చెప్పవచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×