Digital Currency: రానున్న రోజుల్లో డిజిటల్ కరెన్సీ రానుందా? నార్మల్ కరెన్సీ మారిదిగానే డిజిటల్ కరెన్సీ ఉంటుందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారెంటీ ఇస్తుందా? మంత్రి పియూష్ గోయల్ ప్రకటన వెనుక అసలు మేటరేంటి? అక్రమ లావాదేవీలకు చెక్ పెట్టేందుకు వీటిని తీసుకురానుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
డిజిటల్ కరెన్సీ రాక
క్రిప్టో కరెన్సీపై మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది కేంద్రం.క్రిప్టో కరెన్సీలను తాము ప్రోత్సహించబోమని తేల్చి చెప్పేశారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. దానికి గ్యారెంటీ లేదని స్పష్టంచేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్‌బీఐ గ్యారెంటీతో కూడిన డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నట్లు ప్రకటన చేశారు.
దోహలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, డిజిటర్ కరెన్సీకి సంబంధించిన కీలక విషయాలు బయటపెట్టారు. సాధారణ కరెన్సీ మాదిరిగానే డిజిటల్ కరెన్సీకి ఆర్బీఐ గ్యారెంటీ ఉంటుందన్నారు. డిజిటల్ కరెన్సీ వల్ల లావాదేవీలు అత్యంత ఈజీగా జరుగుతాయని చెప్పారు. కాకపోతే డిజిటల్ కరెన్సీ వల్ల పేపర్ వాడకం తగ్గుతుందని, బ్యాంకింగ్ వ్యవస్థలో ఆయా లావాదేవీలు వేగంగా ఉంటాయన్నారు.
క్రిప్టో కరెన్సీ నో ఛాన్స్
కేవలం ఎలక్ట్రానిక్ రూపంలో ఉండనుంది. డిజిటల్ కరెన్సీ సిస్టమ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా పని చేస్తుందని, ట్రాన్పరెన్సీ-ట్రేసబులిటీ ఉంటుందని వెల్లడించారు. ప్రతీ డిజిటల్ కరెన్సీ లావాదేవీలను సిస్టమ్ ద్వారా వెరిఫైయ్ చేస్తారు. దీనివల్ల అక్రమ లావాదేవీలకు చెక్ పెట్టొచ్చు.
అదే సమయంలో క్రిప్టో కరెన్సీల సమస్యలను ప్రస్తావించారు. భారతదేశంలో నిషేధించనప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదన్నారు. నియంత్రించబడని డిజిటల్ ఆస్తులతో సంబంధం ఉన్న నష్టాలను నొక్కి చెప్పారు. బిట్ కాయిన్ లాగా ప్రైవేట్‌గా జారీ చేయబడిన క్రిప్టోకరెన్సీలు ఎలాంటి అధికారిక హామీ లేకుండా పని చేస్తాయన్నారు.
ALSO READ: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త.. కనీస పెన్షన్ పెంచే ఛాన్స్
దాని విలువకు హామీ ఇచ్చే బ్యాకెండ్ లేదన్నారు. రేపటి రోజున కొనుగోలుదారుడు లేకపోతే హామీ ఇవ్వడానికి ఎవరూ ఉండరన్నారు. అందువల్లే ప్రభుత్వం అలాంటి వాటిపై భారీగా పన్నులు విధించిందన్నారు. మొత్తానికి క్రిప్టో ఏమోగానీ, డిజిటల్ కరెన్సీపై ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ వచ్చేసింది. మార్కెట్లో గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసిన మాదిరిగా డిజిటల్ కరెన్సీ ఉంటుందని కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.