BigTV English

Wife Killed Husband : తాగుడుకి బానిసైన భర్త.. స్క్రూడ్రైవర్ తో పొడిచి చంపిన భార్య

Wife Killed Husband : తాగుడుకి బానిసైన భర్త.. స్క్రూడ్రైవర్ తో పొడిచి చంపిన భార్య

Wife Stabs Husband to Death with Screwdriver : తాగుడుకి బానిసైన భర్తల కారణంగా ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. భరించగలిగిన వారు పిల్లల్ని చూసి కలిసి సర్దుకుపోతుంటే.. భరించలేని భార్యలు వారి నుంచి విడిపోతున్నారు. లేదంటే.. ఆ వ్యక్తినే ఊహించని పరిణామంతో చంపేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే కృష్ణాజిల్లాలో జరిగింది. భార్య చేతిలో హతమయ్యాడో భర్త. ఈ ఘటన బంటుమిల్లి మండలం చిన్నతుమ్మడి గ్రామంలో జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పారావు, కీర్తనలకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. అప్పారావు నెమ్మదిగా తాగుడికి బానిసయ్యాడు. దీంతో తరచూ గొడవలయ్యేవి. మారుతాడని సర్దుకుపోయేది కీర్తన. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అప్పారావు తాగి ఇంటికి రావడంతో గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా పెద్దది కావడంతో.. కీర్తన ఆగ్రహంతో అప్పారావుపై దాడి చేసింది. చేతికి అందిన స్క్రూ డ్రైవర్ తో మెడపై పొడవడంతో అక్కడికక్కడే అప్పారావు చనిపోయాడు.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించి.. కీర్తనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దంపతుల మధ్య గొడవకు కారణం అతను మద్యపానానికి బానిసవ్వడమేనా ? లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.


Tags

Related News

Dating App: దారుణం.. డేటింగ్ యాప్‌లో ఓ యువకుడు బట్టలు విప్పి.. చివరకు..?

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Big Stories

×