Jagtial Crime: సంపాదించిన జీతం ఇంటికి ఇవ్వలేదు ఆ వ్యక్తి. దీంతో భర్తపై కోపం పెంచుకుంది భార్య. అవసరం కోసం వెయిట్ చేసింది. ఆ క్రమంలో పుట్టింటికి వెళ్లిపోయింది. చివరకు భర్తని రప్పించుకుని, మిడ్ నైట్ చున్నీతో ఉరేసి చంపేసింది. సంచలనం రేపిన ఈ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది.
జీతం ఇవ్వలేదని భర్తని లేపేసింది
జగిత్యాల జిల్లా అమ్మక్కపేట ప్రాంతానికి భూమేశ్‌కు కొత్తదాంరాజుపల్లికి చెందిన విజయతో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. మొదట్లో దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బులు ప్రతీనెలా ఇంటికి ఇచ్చేవాడు. భార్య వాటిని తీసుకుని కుటుంబాన్ని మేనేజ్ చేసేది. డబ్బుల విషయంలో భూమేశ్-విజయల మధ్య ఏం జరిగిందో తెలీదు.
కొద్దిరోజుల తర్వాత ఈ దంపతులు మెట్‌పల్లి అర్బన్ కాలనీలో నివాసం ఉన్నారు. ఉన్నట్లుండి వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. తరుచూ గొడవలు జరిగేవి. ఫ్యామిలీ సమస్యలు అందరి ఇళ్లలో ఉండేవని సహజంగా ఇరుగుపొరుగువారు అనుకునేవారు. ఈ క్రమంలో అలిగి పుట్టింటికి వెళ్లింది విజయ్. తన తల్లి దగ్గర ప్రస్తుతం ఉంటోంది.
జగిత్యాల జిల్లాలో దారుణమైన ఘటన
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం అత్తగారింటికి వచ్చాడు భూమేశ్. రాత్రికి భోజనం చేసిన తర్వాత భార్యభర్తల మధ్య జీతం డబ్బుల విషయంలో మళ్లీ గొడవ జరిగింది. ఈ విషయంలో కూతురికే మద్దతు ఇచ్చింది తల్లి. సంపాదించిన డబ్బులు కుటుంబ అవసరాలకు ఇవ్వడం లేదన్న కారణంతో భార్య.. అర్థరాత్రి భర్తని దారుణంగా చంపేసింది.
ఆదివారం రాత్రి భూమేశ్ నిద్రిస్తున్న సమయంలో అతడి మెడకు చున్నీతో ఉరి వేసి హత మార్చింది. భూమేశ్ డెడ్‌బాడీని ఆ ఊరిలోని రైస్‌మిల్లు సమీపంలోని ఓ సంఘం భవనంలో చూశారు స్థానికులు. వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మల్లాపూర్ ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేశారు.
ALSO READ: శంషాబాద్ లో తీవ్ర విషాదం.. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
చివరకు భూమేశ్ భార్యని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. దీంతో అసలు నిజం బయటపడింది. భర్త మెడకు చున్నీతో ఉరి వేసి హత మార్చినట్లు తెలిపింది. ఈ ఘటన వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కేవలం డబ్బు విషయంలో అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తను చంపేసింది.