E-Paper
Advertisement

Hyderabad: శంషాబాద్‌లో తీవ్ర విషాదం.. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య..

Hyderabad: శంషాబాద్‌లో తీవ్ర విషాదం.. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య..
Advertisement

Hyderabad: అబ్బా.. ఈ రోజుల్లో ఇలా కూడా ఉన్నారా.. భార్యను ఎప్పుడు అనుమానిస్తూ.. మరో మహిళతో సంబందాలు పెట్టుకుంటూ.. అడ్డు వచ్చినందుకు భార్య పిల్లలను చంపే.. ఈ కాలంలో భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఓ భర్త ఆత్మహత్య పాల్పడ్డాడు. పాపం.. ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉంటే ఆ భార్యలు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవాలి.. అయితే అసలు ఏం జరిగిందంటే..

Advertisement

భార్య మరణాన్ని జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌లో జరిగింది. అయితే ఆర్జీఐఏ ఇన్‌స్పెక్టర్‌ కె.బాల్‌రాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్‌(40) ఏడాదిన్నర క్రితం తన భార్య శ్రావ్య(35)ను తీసుకొని శంషాబాద్‌కు వచ్చారు. అతను స్థానిక ఎయిర్ పోర్టులో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

భార్య శ్రావ్య ఐవీఎఫ్ ద్యార గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి.. అయితే ఆమె గర్భంలో కవలలు పెరుగుతున్నట్లు సమాచారం ఇవ్వంతో వారు ఎంతో సంతోషించారు. కానీ, వారి సంతోషం ఎంతో కాలం ఉండలేదు.. అయితే శ్రావ్య ఈ నెల 16న రాత్రి ఏడు గంటలకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అత్తాపూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అనూహ్యంగా శ్రావ్య గర్భంలోనే కవలలు మృతి చెందారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.

Advertisement

Also Read: బేగంపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు!

శ్రావ్యకు మెరుగైన వైద్యం కోసం గుడిమల్కాపూర్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె కూడా ప్రాణాలు విడిచింది. తీవ్ర మనస్తాపానికి గురైన విజయ్.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో శంషాబాద్ లోని ఇంట్లో ఉరేసుకున్నారు. దంపతులు, వారి కవలల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×