Bhupalpally Murder Case: రోజు రోజుకు పెరిగిపోతున్న భర్తల హత్యలు.. సామాజిక విలువలు, కుటుంబ బంధాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి. ప్రేమ పేరుతో ఏర్పడుతున్న వివాహేతర సంబంధాలు హత్యలకు దాకా దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో భార్యలు తమ ప్రియుడి సహకారంతో భర్తలను హత్య చేస్తున్న ఘటనలు వరుసగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మగవారు పెళ్లిల్లు చేసుకోవాలంటే భయపడుతున్నారు.
భర్తను చంపించిన భార్య
అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొంపల్లి మండలంలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడనే అక్కసుతో భార్య రేణుక తన రెండో భర్త రవిని హత్య చేయించింది. ఈ ఘాతుకంలో ఆమె మొదటి భర్తకు చెందిన కొడుకు, ప్రస్తుత ప్రియుడు కూడా భాగస్వాములయ్యారు.
జెన్ కో సెక్యూరిటీ గార్డ్ శ్రీపాల్ రెడ్డితో పరిచయం
ప్రభుత్వ సమాచారం మేరకు, 13 ఏళ్ల క్రితం కొంపల్లికి చెందిన రవిని రేణుక రెండో వివాహం చేసుకుంది. ఆమెకు ఇది కూడా రెండో వివాహమే. మొదటి భర్తకు చెందిన ఓ కుమారుడు కూడా ఆమెతో ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం జెన్ కో సెక్యూరిటీ గార్డ్ శ్రీపాల్ రెడ్డితో రేణుకకు పరిచయం ఏర్పడింది. ఈ వ్యవహారాన్ని భర్త రవి గమనించి, తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. రేణుక వివాహేత సంబంధంపై రవి తరుచూ గొడవ పడేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. దీంతో రేణుక అతనిపై కోపంగా ఉండేది.
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని హత్య చేసిన రేణుక
రవి తనకు అడ్డుగా మారుతున్నాడని భావించిన రేణుక, ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. హత్యకు సమయాన్ని, స్థలాన్ని సిద్ధం చేశారు. చివరికి తన మొదటి భర్త కుమారుడు శ్రీకర్, దీనిలో జోక్యం చేయించి, సెక్యూరిటీ గార్డు శ్రీపాల్ రెడ్డితో కలిసి ప్లాన్ అమలు చేసింది.
Also Read: ఘోర ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. 25 మంది ప్రాణాలు
రూ.1.5 లక్షలు సుపారీ ఇచ్చి హత్య..
తర్వాత ముగ్గురూ కలిసి సుపారీ గ్యాంగ్‌ను ఏర్పాటే చేశారు. అలాగే వారికి లక్షన్నర సుపారీ ఇచ్చింది. ఈ నెల 10న రవిని తిరుమలగిరి శివారు ప్రాంతానికి కారులో తీసుకెళ్లాడు శ్రీకర్. సుపారీ గ్యాంగ్‌తో కలిసి రవిని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లారు దుండగులు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కు తరలించారు. రవి మొదటి భార్య లక్ష్మి ఫిర్యాదుతో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.