Bus Road Incident: మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అడ్డాకుల మండలం కాటవరం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
కంటైనర్ ట్రక్ రోడ్డు పక్కన ఆగివుండగా, హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అతివేగంతో ప్రయాణిస్తూ ఈ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినడంతో, బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. అలాగే మరో ముగ్గురు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడి స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి గాయపడిన ముగ్గురిని వెంటనే మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
Also Read: మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు..
ప్రాణాలు తీస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులు..
అయితే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రమాద వివరాలను పరిశీలించారు. ప్రమాదానికి కారణం అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం లేదా రోడ్డు పరిస్థితులు కావచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ అలసత్వం లేదా రోడ్డుపై సరైన సూచనలు లేకపోవడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. కానీ, ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల అతివేగం కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి వందల మంది చనిపోతున్నారు. ప్రైవేట్ బస్సులో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!
కంటైనర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు
ఈ ఘటనలో నలుగురు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
అడ్డాకుల మండలం కాటవరం వద్ద ప్రమాదం
హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న బస్సు
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం pic.twitter.com/DAEXitzD1r
— BIG TV Breaking News (@bigtvtelugu) September 1, 2025