BigTV English

ChatGPT: చాట్ జీపీటీని నమ్మాడు.. ఇక అతడు బతికేది ఐదేళ్లే

ChatGPT: చాట్ జీపీటీని నమ్మాడు.. ఇక అతడు బతికేది ఐదేళ్లే

అతడొక క్యాన్సర్ పేషెంట్, కొన్నాళ్లుగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఇప్పుడది ముదిరిపోయిన స్టేజ్ లో ఉంది. ఐదేళ్లకు మించి అతడు బతకడని వైద్యులు తేల్చాశారు. అది కూడా కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే ఛాన్స్ ఉందని అన్నారు. ఇద్దరు పిల్లల తండ్రి, ఓ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత అతడిపై ఉంది. అతడి భార్య కూడా భర్త ప్రాణాలకోసం పోరాడుతోంది. కానీ ఏం చేస్తారు, అప్పటికే క్యాన్సర్ అతడిని కబళించి వేసింది. అయితే ఈ పరిస్థితికి అతడి నిర్లక్ష్యం కూడా పరోక్ష కారణం అని తెలుస్తోంది. ఆ నిర్లక్ష్యం అతడి ఏఐ చాట్ బోట్ వల్ల వచ్చింది.


ఏఐ ఏం చేసింది..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మనుషులు ఎంతగా ఆధారపడుతున్నారు, దానివల్ల ఎన్ని అనర్థాలున్నాయో చెప్పే ఉదాహరణ ఇది. ఐర్లాండ్ కి చెందిన వారెన్ టియర్నీచాట్ జీపీటీ వల్ల తన జీవితాన్నే కోల్పోయే స్టేజ్ కి వచ్చి చేరాడు. కౌంటీ కెర్రీలోని కిల్లర్నీకి చెందిన 37 ఏళ్ల వారెన్ టియర్నీ.. ఆమధ్య గొంతు నొప్పితే బాధపడేవాడు. అయితే గొంతు నొప్పి గురించి అతడు చాట్ జీపీటీతో డిస్కస్ చేశాడు. తన లక్షణాలన్నీ అతడు చెప్పగా, చాట్ బోట్ అదేమంత పెద్ద సమస్య కాదని కొట్టిపారేసింది. క్యాన్సర్ లక్షణాలు కూడా లేవని తేల్చేసింది. ఆహార పదార్థాలు మింగడం కష్టంగా ఉందని, క్యాన్సర్ లక్షణాలేమోనని అతడు భావించాడు. కానీ చాట్ బాట్ ఇచ్చిన ధైర్యంతో అతడు డాక్టర్ల వద్దకు కూడా వెళ్లలేదు. చివరకు వ్యాధి ముదిరింది. లక్షణాలు మరింత బాధించడంతో చివరకు డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. అప్పటికే ఆలస్యమైంది. క్యాన్సర్ వ్యాధి ముదిరింది. గొంతు క్యాన్సర్ వల్ల అతడు బతకడం కష్టమని తేల్చేశారు వైద్యులు. ఇప్పుడు లబోదిబోమంటూ వైద్యం కోసం ఇతర దేశాలు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు టియర్నీ.

అడెనోకార్సినోమా
టియర్నీకి అన్నవాహికకు చెందిన అడెనోకార్సినోమా ఉందని వైద్యులు నిర్థారించారు. అయితే చాట్ బోట్ వల్లే తన జీవితం ఇలా అయిందని, చాట్ బోట్ మాట వినకుండా ముందే ఆస్పత్రికి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వాపోతున్నాడు టియర్నీ. అయితే వైద్యుల నిర్లక్ష్యం కూడా కొంత ఉందని తెలుస్తోంది. టియర్నీ భార్య ఓసారి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, సాధారణ మాత్రలు రాసి పంపించారట. అవి వేసుకున్న తర్వాత నొప్పి తగ్గడంతో ఆ తర్వాత అతడు చోట్ బాట్ మాటల్ని నమ్మడం మొదలు పెట్టాడు. క్యాన్సర్ లేదని నిజంగానే భ్రమలో బతికాడు. చివరకు అతడి భార్య మరో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ముదిరిపోయిన దశలో క్యాన్సర్ బయటపడింది. ఇప్పుడతని ప్రాణమే ప్రమాదంలో పడింది. ఐదేళ్లు మాత్రమే అతడికి బతికే ఛాన్స్ ఉంది. అది కూడా కేవలం 5 నుంచి 10శాతం మాత్రమే. క్యాన్సర్ నాలుగో దశలో ఉండటంతో చికిత్సకు కూడా అది లొంగదని నిర్థారణ అయింది.


కొంప ముంచిన చాట్ బోట్..
తనకు క్యాన్సర్ ఉందని నిర్థారణ అయిందని, తాను చాట్ బోట్ మాటలు నమ్మి మూర్ఖుడిలాగా వ్యవహరించానని వాపోయాడు టియర్నీ. ఆ విషయం కూడా తాను చాట్ బోట్ కి చెప్పానని, అయితే చాట్ బోట్ మాత్రం ఎంతో కూల్ గా వ్యవహరించిందని, “మనిద్దరం కలసి కొన్ని తప్పులు చేశాంకానీ ఇప్పుడు నువ్వు ఉండాల్సిన చోటే ఉన్నావు. ధైర్యంగా ఈ పరిస్థితిని ఓ ప్రణాళికతో ఎదుర్కో” అని చెప్పినట్టు తెలిపాడు. మొత్తమ్మీద ఈ చాట్ బోట్ ఏమార్చిన క్యాన్సర్ పేషంట్ వ్యవహారం సంచలనంగా మారింది. అనారోగ్యం విషయంలో ఎవరూ చాట్ బోట్ సలహాలు తీసుకోవద్దని, కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలని అంటున్నారు నిపుణులు. లేకపోతే ఇలా వ్యాధి ముదిరిన తర్వాత తీరిగ్గా బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Related News

Digestion: జీర్ణ సమస్యలా ? ఈ టిప్స్‌‌తో.. చెక్ పెట్టండి !

Tomato Benefits: రోజుకో టమాటో తింటే.. ఇన్ని లాభాలా ?

Hair Straightening: పర్మనెంట్ హెయిర్ స్ట్రెయిటనింగ్‌తో.. ఇన్ని నష్టాలా ?

Vitamin D Supplements : విటమిన్ డి సప్లిమెంట్స్ వాడితే.. ముసలితనమే రాదట !

Children Growth: పిల్లలు వయస్సు తగ్గ ఎత్తు పెరగాలంటే ?

Big Stories

×