Husband And Wife Incident: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను గొంతు నులిమి చంపాడు ఓ భర్త.. బూర్గంపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన షంషీర్ పాష, సోని భార్య భర్తలు.. వీరికి 12 ఏళ్ళ కూమారుడు కూడా ఉన్నాడు. అయితే సోమవారం రాత్రి వారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. భర్త గొంతు నులిమి చంపేశాడు.
భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం..
అయితే అసలు వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన షంషీర్ పాష, సోని భార్య భర్తలు.. వీరి ఇద్దరికి ఆర్థిక సమస్యల గురించి భర్త భార్యతో గొడవ పడ్డాడు.. దీంతో భార్య తనమాట వినడం లేదని భర్త గొంతు నులిమి చంపేశాడు.. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న తన కుమారుడి చూడటంతో తానే పోలీసులకు వెళ్లి సమాచారం తెలిపాడు. ఆ తర్వాత తెల్లవారు జామున నిందితుడి అక్కడి సమీపంలోని PSకి వెళ్లి లొంగిపోయాడు. ప్రస్తుతుం ఇప్పుడు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్
మరో విషాదం..
ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లి చెప్పడమే పాపమైంది ఓ పిల్లాడికి. గేమ్స్‌కు అడిక్ట్ కావొద్దురా అని అమ్మ మందలించినందుకు ఏకంగా… ఆత్మహత్య చేసుకున్నాడు తొమ్మిదో తరగతి విద్యార్థి. జగిత్యాల జిల్లా లింగంపేటకు చెందిన విద్యార్థి విష్ణువర్ధన్.. తరచూ మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని అతని తల్లి మందలించడంతో.. ఆమెపై తిరగబడి దాడి చేశాడు. అనంతరం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.