OTT Movie : ఒక కొరియన్ హై-ఇంటెన్సిటీ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులకి సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తోంది. ఈ స్టోరీ విమానంలో జరిగే బయోటెరర్ దాడి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, యాక్టింగ్ స్కిల్స్ కి ప్రశంసలు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమా కొరియన్ బాక్స్ ఆఫీస్‌లో మొదటి రోజు 336,751 వ్యూస్ తో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
ఇంచియాన్ ఎయిర్‌పోర్ట్‌లో, జిన్-సియోక్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ, ఒక విమానంలో బయోటెరర్ దాడి కోసం వైరస్‌ను రహస్యంగా తీసుకెళ్తాడు. దాన్ని అస్తమా ఇన్‌హేలర్‌లో దాచుకుంటాడు. ఆ విమానంలో జే-హ్యుక్ తన కూతురు సూ-మిన్‌తో, డిటెక్టివ్ ఇన్-హో తన భార్య హై-యూన్‌తో హవాయి వెళ్తుంటారు. విమానం గాల్లో ఉండగా, ఒక ప్రయాణీకుడు వైరస్ వల్ల దారుణంగా చనిపోతాడు, దీంతో విమానంలో గందరగోళం మొదలవుతుంది. జిన్-సియోక్‌ను ఇన్-హో తన మనుషులతో ట్రాక్ చేస్తూ, అతని ఇంట్లో యానిమల్ టెస్టింగ్ ఆధారాలు, ఒక డీకంపోజింగ్ కార్ప్స్ కనుగొంటాడు. ఈ సమయంలో విమానం ఇంధనం తగ్గిపోతుండగా, ఇతర దేశాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు నిరాకరిస్తాయి. కో-పైలట్ హ్యున్-సూ, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ కిమ్ సూక్-హీ ప్రయాణీకులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తారు.
గాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుండగా, జే-హ్యుక్ తన కూతురు సూ-మిన్‌ను కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెడతాడు. అయితే విమానంలోని ప్రయాణీకులు భయం, సెల్ఫిష్‌నెస్‌తో ఒకరితో ఒకరు గొడవలు పడతారు. జిన్-సియోక్ గతంలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ వల్ల జీవితం నాశనం అయిన బాధితుడని ఇన్-హో తెలుసుకుంటాడు. అతని ప్రతీకారం వెనుక కారణం బయటపడుతుంది. ఇంతలో విమానాన్ని ఒక మారుమూల ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అవుతుందా ? ఆ వైరస్ వల్ల ఎంతమంది చనిపోతారు ? జిన్-సియోక్ గతం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే
‘Emergency Declaration’ ఒక కొరియన్ హై-ఇంటెన్సిటీ థ్రిల్లర్ సినిమా. దీన్ని హాన్ జే-రిమ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో సాంగ్ కాంగ్-హో, లీ బ్యుంగ్-హన్, జియోన్ డో-యియోన్, కిమ్ నామ్-గిల్, ఇమ్ సీ-వాన్ నటించారు. ఈ సినిమా సౌత్ కొరియాలో 2022 ఆగస్టు 3న థియేటర్లలో రిలీజ్ అయి, Coupang Playలో 2022 సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అయింది. ఇది Amazon Prime Video, Viki ప్లాట్ ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా 74వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవుట్ ఆఫ్ కాంపిటీషన్ సెక్షన్‌లో ప్రీమియర్ అయింది.
Read Also : సమ్మర్ క్యాంపుకు వెళ్లి కిల్లర్ చేతికి చిక్కే అమ్మాయిలు… వణుకు పుట్టించే సీన్స్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ