OTT Movie : ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి జానర్ సినిమాలు కావాలన్నా ఒక్క క్లిక్ తో వాలిపోతున్నాయి. వీటిలో థ్రిల్లర్ కంటెంట్ ను ఎక్కువమంది ఫాలో అవుతుంటారు. ఈ జానర్ లో వచ్చిన ఒక బాలీవుడ్ సినిమా మైండ్-బెండింగ్ ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఒక అమ్మాయి సైకో చేతిలో మోసపోతుంది. ఆమెతో అర్ధరాత్రి అలాంటి పని కూడా చేస్తాడు. ఆతరువాత అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
రెండు ఓటీటీలో స్ట్రీమింగ్
‘A Stranger by the Hill’ 2024లో విడుదలైన హిందీ థ్రిల్లర్ చిత్రం. ఇది మునీందర్ కుమార్ దర్శకత్వంలో, MG ఫిల్మ్స్ గ్యారేజ్ నిర్మాణంలో రూపొందింది. ఇందులో పూర్వి ముండాడా (మహి), దిశాంత్ గులియా (అంగద్), నూరా టెంజిన్ (నూరా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 జూన్ 21న థియేటర్లలో విడుదలై, 1 గంట 40 నిమిషాల రన్‌టైమ్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలో హిందీ ఆడియోతో, ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే
మహి ఒక NRI ఫోటోగ్రాఫర్. తన దివంగత తల్లి ఇష్టపడే మనాలీని సందర్శించడానికి ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి వస్తుంది. అక్కడ ఆమె స్థానికంగా పనిచేసే అంగద్ అనే ఒక టీచర్ ను కలుస్తుంది. అతని వ్యక్తిత్వం ఆమెను ఆకట్టుకుంటుంది. వీళ్ళ సమావేశం త్వరగా రొమాంటిక్ ఎన్‌కౌంటర్‌గా మారుతుంది. మహి ఒకరోజు ఒంటరిగా ఉండే అంగద్ ఇంటికి వెళ్తుంది. ఆ రాత్రి అతనితో ఏకాంతంగా గడుపుతుంది. అయితే ఆతరువాత ఆమెకు అంగద్ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడు. ఆమెను ఇంట్లో బంధించి, ఫోన్ సిమ్‌కార్డ్‌ను కూడా తొలగిస్తాడు. ఆమెను ఎవరితో కలవకుండా బయటి ప్రపంచం నుండి వేరుచేస్తాడు.
అంగద్ ప్రవర్తన, అతని ఉద్దేశాలు మహిని భయాందోళనకు గురిచేస్తాయి. ఇంతలో అంగద్ ఇంటి పనిమనిషి నూరా అక్కడికి వస్తుంది. కానీ అంగద్ వారిద్దరినీ కలవనీయకుండా జాగ్రత్త పడతాడు. మహి ఈ చెర నుండి తప్పించుకోవడానికి నూరాతో మాట్లాడే మార్గం కోసం ప్రయత్నిస్తుంది. అంగద్ అబ్సెసివ్ ప్రవర్తన, మహిని బంధించడం వెనుక ఉన్న డార్క్ సీక్రెట్ కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది. నూరాకి విషయం తెలిసిపోతుంది. మహికి సహాయం చేయడానికి అంగద్‌తో ఫైట్ చేస్తుంది. ఇది ఒక ఉత్కంఠభరిత ఎస్కేప్ సీక్వెన్స్‌కు దారితీస్తుంది. క్లైమాక్స్‌లోఒక “మైండ్-బెండింగ్ ట్విస్ట్” తో అంగద్ సీక్రెట్స్ బయట పడతాయి. అంగద్, మహిని ఎందుకు కిడ్నాప్ చేసాడు ? అతని గతం ఏమిటి ? క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.