Eluru Nimajjanam: ఆదివారం రోజు వినాయకుడి నిమజ్జనాల అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే 5 రోజులు ఎంతో నిష్టగా వినాయకుడి పూజలు చేసి.. నిమజ్జన వేడుకలు ఘనంగా చేశారు. ఈ నిమజ్జన వేడుకల సమయంలో పలు చోట్ల తీవ్ర విషాన్ని నింపింది.
ఫ్లెక్సీల విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం
పశ్చిమగోదావరి జిల్లా వినాయక చవితి ఉరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వీరవాసరం మండలం నడపనవారిపాలెంలో మధ్య ఫ్లెక్సీల విషయంలో వివాదం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఒక వర్గం వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. ఆ ఫ్లెక్సీలు తొలగించాలన్నారు మరో వర్గం వారు. ఫ్లెక్సీలు తొలగించకపోవడంతో.. అక్కడికి వచ్చి ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అడ్డువెళ్లిన ఓ యువకుడి తల్లిపై దాడి
అయితే.. ఈ వివాదం ఫ్లెక్సీలో పెట్టిన ఓ డైలాగ్ కారణంగా గొడవ ప్రారంభమైనట్లు తెలిపారు. కపాలం పగిలిపొద్దంటూ ఓ సినిమా డైలాగ్‌ను ఫ్లెక్సీలో పెట్టడంతో.. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ ఫ్లెక్సీని తొలగించారు. దీంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఓ యువకుడి తల పగిలింది. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే తమ కుమారుడిపై దాడి చేస్తుండగా అడ్డువెళ్లిన తల్లిపై సైతం దాడి చేశారు. ప్రస్తుతం గాయపడినవారు పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కంటైనర్ ఢీ కొన్న ట్రావెల్స్ బస్సు.. స్పాట్‌లో నలుగురు మృతి!
చిత్తూరు జిల్లాలో మరో ప్రమాదం..
అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో గంగవరం మండలం చిన్నమనాయనిపల్లి గణేష్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జన సమయంలో చెరువులు పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు అదే గ్రామానికి చెందిన భార్గవ్, చరణ్ గా గుర్తించారు. నిమజ్జనం ముగించుకుని ఇంటికెళ్తుండగా.. ఇద్దరు కనిపించకపోవడంతో చెరువులో వెతికారు. విగత జీవులుగా పడి ఉన్న ఇద్దరి మిత్రుల శవాలను గ్రామస్తులు బయటకు తీశారు.