CM Revanth Reddy: తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించి రంగారెడ్డి జిల్లాకు నీరు ఇవ్వాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని సీఎం మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ లోని హోటల్ దస్పల్లాలో వైఎస్సార్ మెమోరియల్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read:Srikakulam News: లవ్ మ్యారేజీకి ఒప్పుకోవడం లేదని.. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్.. చివరకు?
ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డును వై సుభాష్ పాలేకర్ కు అందజేశారు. రసాయన ఎరువుల కొనుగోలు రూపంలో మన రూ. లక్షల కోట్ల విలువైన సంపద బయట దేశాలకు వెళ్తుందని.. మన డబ్బు విదేశాలకు వెళ్లొద్దంటే రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సీఎం పిలుపునిచ్చారు. సుభాష్ పాలేకర్ ను స్ఫూర్తిగా తీసుకుని రైతులు సేంద్రీయ ఎరువును ఉపయోగించాలని చెప్పారు.
YSR మెమోరియల్ అవార్డు కార్యక్రమంలో ఆసక్తికర ఘటన
వైఎస్ షర్మిలను వేదికపైకి స్వయంగా ఆహ్వానిస్తున్నానని, తన కుర్చీలో కూర్చోవచ్చని ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/1zkquS78Y9
— BIG TV Breaking News (@bigtvtelugu) September 2, 2025
మన దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని వైఎస్సార్ అనే వారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. వైఎస్సార్ కోరిక తీర్చే బాధ్యతను తాను, వైఎస్ షర్మిల, కేవీపీ సహా మేమంతా తీసుకుంటామని చెప్పారు. ఇందుకు ప్రజల సహకారం కూడా కావాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల సభ వేదికపై కాకుండా కింద కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఇదంతా గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ‘షర్మిల గారూ వేదిక మీదకు రావాల్సిందిగా స్వాగతిస్తున్నాను. నా కుర్చీ ఉందమ్మా.. కూర్చోవచ్చు రండి’ అని ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: BRS Reactions: కవితపై ఇంత కక్ష ఉందా? ఒక్కొక్కరే బయటకొస్తున్న బీఆర్ఎస్ నేతలు