Indian Railways: ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే తరచుగా మౌళిక వసతులను అప్ డేట్ చేస్తూ ఉంటుంది. దేశంలోని పలు డివిజన్లలో ఎక్కడో ఒకచోట పనులు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా జార్ఖండ్ మీదుగా వెళ్లే పలు రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా చక్రధర్ పూర్ డివిజన్ లో రైల్వే పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ పనుల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్లు ప్రభావితం కానున్నాయి. ముఖ్యంగా చర్లపల్లి, హైదరాబాద్, విశాఖపట్నం వెళ్లే రైళ్ల మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఈ మార్గాల్లో రైల్వే ప్రయాణాలు చేసే వాళ్లు రద్దు అవుతున్న రైళ్ల వివరాలను తెలుసుకోవాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్ అయ్యే రైళ్లు ఇవే!
రైల్వే లైన్ల మెయింటెనెన్స్ కారణంగా చర్లపల్లి, హైదరాబాద్, విశాఖ పరిధిలో ప్రభావితం అయ్యే రైళ్లకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు. ఇంతకీ వీటిలో ఉన్న రైళ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ రైలు నెంబర్ 17007 చర్లపల్లి – దర్భంగా ఎక్స్ ప్రెస్ ఆగస్టు 26, సెప్టెంబర్ 9 తేదీలలో క్యాన్సిల్ చేయబడింది.
⦿ రైలు నెంబర్ 17008 దర్భంగా – చర్లపల్లి ఎక్స్ ప్రెస్ ఆగస్టు 29, సెప్టెంబర్ 12 తేదీలలో రద్దు అవుతుంది.
⦿ రైలు నెంబర్ 18523 విశాఖపట్నం – బనారస్ ఎక్స్ ప్రెస్ ఆగస్టు 27, 31, సెప్టెంబరు 7, 10న రద్దు చేశారు.
⦿ రైలు నం. 18524 బనారస్ – విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ ఆగస్టు 28, సెప్టెంబర్ 1,8, 11న క్యాన్సిల్ అవుతుంది.
⦿ రైలు నెంబర్ 17005 హైదరాబాద్ – రక్సౌల్ ఎక్స్ ప్రెస్ ఆగస్టు 28న రద్దు కానుంది.
⦿ రైలు నెంబర్ 17006 రక్సౌల్ – హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ఆగస్టు 31న క్యాన్సిల్ చేశారు.
⦿ రైలు నెంబర్ 07051 చర్లపల్లి – రక్సౌల్ స్పెషల్ ఆగస్టు 30న క్యాన్సిల్ చేయబడింది.
⦿ రైలు నెంబర్ 07052 రక్సౌల్ – చర్లపల్లి స్పెషల్ సెప్టెంబర్ 2న రద్దు చేశారు.
⦿ రైలు నెంబర్ 07005 చర్లపల్లి – రక్సౌల్ స్పెషల్ సెప్టెంబర్ 1న రద్దు కానుంది.
⦿ రైలు నం. 07006 రక్సౌల్ – చర్లపల్లి స్పెషల్ సెప్టెంబర్ 4న రద్దు అవుతుంది.
Read Also: ఆ నగరాలకూ బుల్లెట్ రైళ్లు.. జాబితాలో ఏపీ, తెలంగాణ ఉన్నాయా? ప్రాజెక్ట్ డిటైల్స్ ఇవే!
క్యాన్సిల్ అయిన రైళ్లలో అన్ని రాంచీ మీదుగా నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సమీపంలోని రైల్వే స్టేషన్లలో ఎంక్వయిరీ అధికారులను సంప్రదించాలన్నారు. లేదంటే రైల్వే అధికారిక వెబ్ సైట్ ను చూడాలని సూచించారు.
Read Also: హైదరబాద్ నుంచి నేరుగా యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్.. కేంద్రం కీలక నిర్ణయం!