Eluru School Bus Incident: పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్ పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సలో ఏకంగా 25 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. అయితే బస్సు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడే పంట పొలాల్లో పని చేస్తున్న రైతులు చెబతున్నారు.
Also Read: రష్యాతో దోస్తానా వద్దు! ఇండియాకు నాటో వార్నింగ్
పాలిగ్రామం శివారులో బస్సు బొల్తా పడింది. అయితే రోజులాగే బస్సు విద్యార్థులను బస్సు ఎక్కించుకుని స్కూల్ టైం అవుతుందని తొందరగా పిల్లలను స్కూల్‌కి చేర్చాలని కంగారులో అతివేగంతో వెళ్లిన బస్సు పంట చెల్లోకి దూసుకెళ్లింది. తణుకు శ్రీ సాయి విద్యాసంస్థలు బస్‌గా గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. అక్కడే ఉన్న రైతులు వెంటనే స్పందించి బస్సు లోపల ఉన్న పిల్లలను బయటకు తీసి గాయపడిన వారిని రక్షించేందుకు 108కు కాల్ చేశారు. దీంతో అంబులెన్స్ గాయపడిన వారిని అక్కడి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే రాజేంద్రనగర్‌లో డైరీ ఫామ్ చౌరస్తాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టమోటో లోడుతో వెళ్తున్న లారీ పిల్లర్‌ని ఢీకొట్టడంతో లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టమోటాలు రోడ్డుపై పడటంతో వాహన రాకపోకలకు అంతరాయం కల్గింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లీయర్ చేశారు.