Medchal News: మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్లి చెరువులో పడి తండ్రికొడుకులు మృతిచెందారు. నిన్న రాత్రి గణేష్ నిమజ్జనం సందర్భంగా దుండిగల్ తండ్రి కొడుకులు ఇద్దరూ నాగలూరు చెరువు దగ్గరకు వెళ్లారు.
నిమజ్జనం పూర్తి అయిన తర్వాత తిరుగు ప్రయాణంలో రాయిని తట్టుకుని ఆటో చెరువులో పడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఆటోతో సహా తండ్రి కొడుకు మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇది హత్యనా..? ఆత్మహత్యనా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిమజ్జనం పూర్తి చేసుకున్న తర్వాత కాలనీ వాసులు అందరూ ఇంటికి వెళ్లారు. అయితే తండ్రి శ్రీనివాస్, అతని కుమారుడు మాత్రం ఇంటికి చేరుకోలేదు. ఇంటికి రాకపోవడం.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ రోజు ఉదయం సంఘటనా స్థలానికి వెళ్లారు. చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ ఓ రాయి చిందరవందరంగా పడపోయి ఉండడాన్ని గమనించారు. రాయిని తాకి ఆటో చెరువులో పడి పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. తండ్రి- కొడుకు మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. దీంతో దుండిగల్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయ.
ALSO READ: Venkatesh: వెంకటేష్ ఇంట్లో విషాదం… 12 సంవత్సరాలుగా కలిసి ఉన్న స్నేహితుడు దూరం
ALSO READ: BHEL Recruitment: భారీ గుడ్‌న్యూస్.. బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు