Vasudha Pharma: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని వసుధ ఫార్మా కెమికల్స్ డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవర ప్రసాదరాజు ఆత్మహత్య చేసుకున్నారు… వెయ్యి కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన కంపెనీ డైరెక్టర్ బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేగింది. కుటుంబంతో కూర్మన్న పాలెంలో నివాసం ఉంటున్న వరప్రసాదరాజు ఆదివారం సాయంత్రం టూవీలర్‌పై బయటికి వెళ్లారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పరిచయస్తులను వాకబు చేశారు.. అయినా ఆచూకీ దొరకలేదు.
డెడ్‌బాడీ పక్కనే పురుగుల మందు డబ్బా
సోమవారం ఆదివారం ఉదయం ఆయన సెల్ కు కాల్ చేయగా, గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ చేసి, వరప్రసాదరాజు ప్రగతి మైదానంలో పడిపోయి ఉన్నట్లు చెప్ప డంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ప్రసాదరాజు మృతిచెందారు. ప్రసాదరాజు పక్కన పురుగుల మందు డబ్బా, వాటర్ బాటిల్ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ పోలీసులు ఘటనా స్థలా నికి చేరుకుని వివరాలు సేకరించి, మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వసుధ పార్మా కెమికల్స్ కంపెనీ 1994లో ఏర్పాటైంది. దానికికి ఎంవీ రామరాజు సీఎండీగా వ్య వహరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వరప్రసాదరాజు బల్క్ డ్రగ్ తయారీ రంగంలో 2007 నుంచి పనిచేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో సైట్ ఉండగా, ప్రదాన కార్యాలయం మాత్రం హైదరాబాద్ లోని కావూరి హిల్స్ లో ఉంది. ఈ కంపెనీ పెంటానిల్ అనే మందును తయారుచేసి అమెరికా, తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ మందును నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. అయితే పెంటానిల్ వినియోగంతో ఆమెరికాలో 12 నెలల కాలంలో అనేక మంది మరణించారనే ది ప్రధాన ఆరోపణ.
Also Read: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు.. బయటకు వెళ్లారో ముంచేస్తుంది.
దీనిపై ఆమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి ఈ డ్రగ్ పసుధ పార్మా నుంచి వస్తోందని గుర్తించింది. దాంతో ఈ సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్, చీప్ గ్లోబల్ బిజినెస్ ఆఫీసర్ తన్వీర్ అహ్మద్ మొహమద్ హుస్సేన్ పార్కర్, మార్కెటింగ్ డైరెక్టర్ మంతెన వెంకట నాగ మధుసూదనరాజులను ఈ ఏడాది మార్చి 20న న్యూయార్క్ లో అరెస్టు చేశారు. వసుధ పార్మా టర్నోవర్ ఏడాదికి 1150 కోట్లు, సుమారుగా 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ నిధులను ఈ సంస్థ అక్రమంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించిందనే అనుమానాలతో ఆదాయ పన్ను శాఖాదికారులు 2023 మార్చి 20న ఏకకాలంలో 50 చోట్ల సోదాలు నిర్వహించారు. తర్వాత జరిగి న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు విశాఖలో వర్క్ డైరెక్టర్ వెంకట సూర్య నాగ వరప్రసాదరాజు ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.