BigTV English

UP Murder: బ్లాక్ మెయిల్ చేస్తూ బాలుడిపై అత్యాచారం.. బ్లాక్ మెయిలర్ ను హత్య చేసిన బాధితుడు

UP Murder: బ్లాక్ మెయిల్ చేస్తూ బాలుడిపై అత్యాచారం.. బ్లాక్ మెయిలర్ ను హత్య చేసిన బాధితుడు

UP Murder: ఉత్తరప్రదేశ్ లో 15 ఏళ్ల బాలుడు 50 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. పదునైన కత్తితో గొంతు కోసి హతమార్చాడు. ముజఫర్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో 15 ఏళ్ల బాలుడు ఓ వ్యక్తిని దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ బాలుడిపై కొన్ని నెలల క్రితం అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆ ఘటనను తన ఫోన్ లో వీడియో తీసుకున్నాడు. అయితే ఆ వీడియోలను చూపించి ఆ వ్యక్తి బెదిరిస్తూ బాలుడిపై తరుచూ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలోనే బాలుడిని గత సోమవారం (మే 19) ఇంటికి పిలిపించుకున్నాడు. అయితే బాలుడు రానని చెప్పడంతో వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. దీంతో ఎలాగైన అతడిని నుంచి విముక్తి కోరుకున్న బాలుడు తన వెంట పదునైన కత్తిని తీసుకువెళ్లాడు. ఆ వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడుతుండగానే కత్తితో గొంతు కోసి చంపేశాడు.


Also Read:మొబైల్ యాప్‌ను ఉపయోగించి.. కాలేజీ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన కార్మికుడు!

అయితే సోమవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి మొబైల్ ఫోన్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు బాలుడే హత్య చేసి ఉంటాడని అనుమానించి మొదట జువైనల్ హోమ్ కు తరలించారు. అయితే తనపై తరుచూ బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడటంతోనే హత్యకు పూనుకున్నట్లు పోలీసుల విచారణలో బాలుడు వెల్లడించాడు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

 

Tags

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×