Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది మన ఇంట్లో ముఖ్యమైన ప్రదేశం. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, వంటగదిలో ఉంచిన ప్రతి వస్తువు మన ఇంటి శక్తి ప్రసరణను ప్రభావితం చేస్తుంది. అందుకే కొన్ని వస్తువులను పొరపాటున కూడా వంటగదిలో ఉంచకూడదు.
వంటగది అనేది మన ఇంట్లో ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ మనం వంట చేసి కుటుంబంతో కలిసి తింటాము. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగది సంపద, శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. వంటగదిలో ఉంచిన ప్రతి వస్తువు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే వంటగదిలో కొన్ని వస్తువులను నివారించాలి. ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అంతే కాకుండా లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తాయి. అందుకే పొరపాటున కూడా వంటగదిలో ఉంచకూడని వస్తువులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రంలోని వంటగదిలో ఆహార పదార్థాలు ఎక్కువ సేపు నిల్వ ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దాని వల్ల వాస్తు దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెత్తగా చేసిన పిండిని కూడా వంటగదిలో ఎక్కువసేపు ఉంచకూడదు. దీని కారణంగా రాహువు , శని యొక్క చెడు ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతే కాకుండా ఇది ఇంట్లో కష్టాలను కూడా పెంచుతుందని నమ్ముతారు.
వ్యర్థ పదార్థాలు:
వంటగదిలో చెత్తను ఉంచడం అశుభం. చెత్త వంటగది అందాన్ని పాడుచేయడమే కాకుండా, ప్రతికూల శక్తికి కారణం అవుతుంది. మనం వంటగదిలో చెత్తను ఉంచినప్పుడు, ఈ ప్రతికూల శక్తి ఇంటి అంతటా వ్యాపించి ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇదే కాకుండా, జంక్ కారణంగా కీటకాలతో పాటు, దోమలు కూడా ఎక్కువవుతాయి. ఇది ఇంట్లో వ్యాధులు వ్యాపించే ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. చెత్తను ఎప్పటికప్పుడు బటయ పడేయాలి.
పగిలిన పాత్రలు:
వంటగదిలో విరిగిన పాత్రలను ఉంచడం అశుభం. విరిగిన పాత్రలు ప్రతికూల శక్తిని సూచిస్తాయి . వీటిని వంటిగదిలో పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూలతను వ్యాప్తి చేస్తాయి. మనం వంటగదిలో విరిగిన పాత్రలను ఉంచినప్పుడు, ఈ ప్రతికూల శక్తి ఇంటి అంతటా వ్యాపించి ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
Also Read: మాలవ్య రాజయోగం.. ఈ రాశుల వారికి 2025 లో తిరుగులేదు
పదునైన వస్తువులు:
కత్తెర, కత్తులు వంటి పదునైన వస్తువులను వంటగదిలో తెరిచి ఉంచకూడదు. కాబట్టి, కత్తులు కత్తెర వంటి పదునైన , కోణాల వస్తువులను ఎల్లప్పుడూ కప్పి ఉంచాలి. వాటిని తెరిచి ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఉత్పన్నమవుతుంది. వీటిని తెరిచి ఉంచడం వల్ల కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.అంతే కాకుండా ఆర్థిక సమస్యలు మెదలవుతాయి.
ఖాళీ డబ్బాలు:
వంటగదిలో ఖాళీ డబ్బాలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరగడం మొదలవుతుంది. వంటగదిలో ఖాళీ పెట్టెలు , పాత్రలను ఉంచడం పేదరికానికి దారితీస్తుందని నమ్ముతారు.