Naga Chaitanya – Sobhita Dhulipala : టాలీవుడ్ కొత్త జంట అక్కినేని నాగ చైతన్య , శోభిత ధూళిపాళ్ళ డిసెంబర్ 4న పెద్దల ఆశీర్వాదంతో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట ఫస్ట్ టైం భార్యాభర్తలుగా కలిసి బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈరోజు అక్కినేని కుటుంబ సభ్యులు కొత్తజంటతో కలిసి శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.
డిసెంబర్ 4న రాత్రి 8 గంటల 13 నిమిషాలకు అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు అక్కినేని , ధూళిపాళ్ల కుటుంబంతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ, ఆత్మీయులు హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు, నాని దంపతులు తదితరులు హాజరయ్యి చై-శోభితను ఆశీర్వదించారు. ఇక పెళ్లి తర్వాత అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేస్తూ, వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.
తాజాగా ఈ జంట శ్రీశైలం మల్లన్న స్వామి చెంత దర్శనమిచ్చింది. శుక్రవారం శ్రీశైలం మల్లన్న టెంపుల్ లో మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారి సేవలో పాల్గొన్నారు కొత్త జంట. అక్కడ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన శోభిత (Sobhita) – నాగ చైతన్య (Naga Chaitanya) మల్లికార్జున స్వామికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇక నూతన దంపతులతో పాటు కింగ్ నాగార్జున కూడా శ్రీశైలం మల్లన్న స్వామి దర్శించుకున్నారు. ఈ ప్రత్యేక శుభ సందర్భంలో నూతన వధూవరులు నాగ చైతన్య – శోభితకు అర్చకులు ఆశీర్వచనాలు, ప్రసాదం అందించినట్టుగా తెలుస్తోంది. ఇక పెళ్లి తర్వాత ఈ జంట మొట్టమొదటిసారిగా పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శోభిత – నాగ చైతన్య ఒకరినొకరు చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకోవడం చూస్తుంటే, కొత్త జంట సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది చూసిన అక్కినేని అభిమానులు నాగ చైతన్య (Naga Chaitanya) – శోభిత (Sobhita) జంట ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.
Newly married couple #NagaChaitanya – #Sobita visit Srisailam Mallikarjuna swamy temple. pic.twitter.com/i3AG9kw0Si
— Madhuri Adnal (@madhuriadnal) December 6, 2024
ఇక శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి చెంతకు వెళ్ళినప్పుడు నాగ చైతన్య, శోభిత ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. నాగచైతన్య తెల్లటి పంచ ధరించగా, శోభిత పసుపు రంగు చీరలో మెరిసింది. ఇక మరోవైపు నాగార్జున కుర్తా పైజామా ధరించి కనిపించారు. ఇదిలా ఉండగా నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ (Thandel) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇక శోభిత చివరిసారిగా లవ్, సితార అనే సినిమాల్లో కనిపించింది. త్వరలోనే ఆమె సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.