E-Paper
Advertisement

Lord Shiva: మీ పూజా గదిలో ఈ మార్పులు కనిపిస్తే.. శివుడు ప్రసన్నమైనట్లే!

Lord Shiva: మీ పూజా గదిలో ఈ మార్పులు కనిపిస్తే.. శివుడు ప్రసన్నమైనట్లే!
Advertisement

Lord Shiva:  మహాశివుడు లయకారుడు మాత్రమే కాదు. అత్యంత దయామయుడు కూడా.. భక్తుల పిలుపుకు పలికే ‘భోళాశంకరుడు’. మన దైనందిన జీవితంలో కొన్ని వింతైన, అద్భుతమైన మార్పులు సంభవించినప్పుడు.. పరమశివుని చల్లని చూపు మనపై పడిందని లేదా ఆయన దివ్య శక్తి మన ఇంటిని ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించకపోయినా.. తన ఉనికిని కొన్ని ప్రత్యేక సంకేతాల ద్వారా చాటుతుంటాడు. ముఖ్యంగా శివారాధకులకు తమ ఇంట్లో శివుని శక్తి ప్రవేశించిందని చెప్పే కొన్ని శుభ సూచికలు ఉంటాయి. మనసులో ప్రశాంతత కలగడం నుంచి కలలో దర్శనమివ్వడం వరకు, శివుడు మీ ఇంటికి వస్తున్నారని సూచించే 9 ముఖ్యమైన సంకేతాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి కేవలం నమ్మకాలు మాత్రమే కాదు. భక్తుల అనుభవాల సారం కూడా.

Advertisement

శివుడు మీ ఇంటిని సందర్శిస్తున్నారని చెప్పే 9 సంకేతాలు:

1. కలలో శివ దర్శనం లేదా సర్ప దర్శనం:
కలలో శివలింగం, త్రిశూలం, డమరుకం లేదా నంది కనిపించడం సాధారణ విషయం కాదు. శివుడు మీ భక్తికి మెచ్చి తన ఉనికిని చాటుతున్నారని దీని అర్థం. అలాగే.. కలలో పాము కనిపించి అది మిమ్మల్ని ఏమీ చేయకుండా వెళ్ళిపోతే.. అది శివుని కంఠాభరణమైన నాగేంద్రుని ఆశీస్సుగా భావించాలి.

Advertisement

2. అకస్మాత్తుగా వినిపించే డమరుక లేదా శంఖ నాదం:
మీరు ధ్యానంలో ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున నిద్ర లేవగానే ఎక్కడి నుంచో డమరుక శబ్దం లేదా ఓంకార నాదం వినిపిస్తే.. శివ శక్తి మీ ఇంట్లో సంచరిస్తోందని అర్థం. ఈ ధ్వనులు మనసును తక్షణమే ప్రశాంతపరుస్తాయి.

3. బిల్వ పత్రాలు లేదా విభూతి సువాసన:
మీ ఇంట్లో ఎక్కడా మల్లెపూలు లేకపోయినా లేదా బిల్వ వృక్షం లేకపోయినా.. అకస్మాత్తుగా గాలిలో ఒక అద్భుతమైన సువాసన వస్తే అది శివుని రాకకు సంకేతం. ముఖ్యంగా విభూతి వాసన లేదా తాజా బిల్వ పత్రాల పరిమళం మీ పూజా గదిలో వస్తే ఆయన మీ పూజను స్వీకరించారని నమ్మాలి.

4. ఇంటికి వచ్చే సాధువులు లేదా అతిథులు:
అతిథి దేవోభవ. శివపురాణం ప్రకారం.. శివుడు అప్పుడప్పుడు సాధువు రూపంలో లేదా యాచకుడి రూపంలో భక్తుల ఇళ్లకు వస్తుంటాడు. అకస్మాత్తుగా ఎవరైనా సాధువు వచ్చి మీకు ఆశీస్సులు ఇచ్చినా లేదా పండు.. ప్రసాదం ఇచ్చినా అది సాక్షాత్తు శివుడి ప్రసాదంగానే భావించాలి.

5. మనసులో అలౌకిక ప్రశాంతత:
ఎన్ని కష్టాలు ఉన్నా, ఇంట్లోకి అడుగు పెట్టగానే మనసు హాయిగా మారిపోవడం, తెలియని ధైర్యం కలగడం శివ తత్వానికి నిదర్శనం. భయం పోయి వైరాగ్యం, భక్తి పెరగడం ఆయన ఉనికికి ప్రధాన సంకేతం.

6. పూజ గదిలో దీపం వెలుగు, పువ్వుల కదలిక:
గాలి లేకపోయినా పూజా గదిలో దీపం జ్వాల స్థిరంగా పైకి ఎగసిపడటం లేదా శివలింగంపై ఉన్న పువ్వులు అకస్మాత్తుగా మీ వైపు పడటం శుభసూచికం. ఆయన మీ కోరికను విన్నారని చెప్పడానికి ఇది ఒక మార్గం.

Also Read: శివరాత్రి పూజా నియమాలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?

7. ఆవు లేదా నంది ఇంటి ముందుకు రావడం:
శివుని వాహనమైన నంది (ఎద్దు) లేదా ఆవు మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి ఆగితే, వాటికి గ్రాసం పెట్టండి. ఇది శివయ్య మీ ఇంటిని ఆశీర్వదిస్తున్నాడనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం.

8. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేల్కొనడం:
ప్రతిరోజూ తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య (బ్రహ్మ ముహూర్తం) మీకు మెలకువ వస్తుంటే.. ప్రకృతి , శివ శక్తి మిమ్మల్ని ధ్యానం చేయమని ప్రేరేపిస్తున్నాయని అర్థం.

9. పక్షులు లేదా సీతాకోకచిలుకల ఆగమనం:
మీ ఇంట్లోకి నీలిరంగు పక్షులు లేదా అరుదైన సీతాకోకచిలుకలు పదే పదే వస్తుంటే.. అది ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరిగిందని, శివుని అనుగ్రహం మెండుగా ఉందని సంకేతం.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×