BigTV English

Jyeshta Masam : జ్యేష్ఠ మాసంలో ఇల్లు కట్టకూడదంటారు ఎందుకంటే…

Jyeshta Masam : జ్యేష్ఠ మాసంలో ఇల్లు కట్టకూడదంటారు ఎందుకంటే…


Jyeshta Masam : హిందూ ధర్మంలో ప్రతీ మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆంగ్ల మాసాలతో పోల్చితే తెలుగు నెలలకి తేడా ఉంటుంది. ఏ మాసంలో ఎలా నడుచుకోవాలో..ఎలా ఉండాలో జాగ్రత్తలు చెబుతోంది మన తెలుగు మాసాలు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా లైఫ్ సాఫీగా సాగిపోవడానికి కొన్ని సూచనలు చేసింది. పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. చాలామంది జ్యేష్ఠ అనగానే మంచి పనులకు పనికిరాదని చెబుతుంటారు. జ్యేష్ఠ దేవి వల్ల హాని కలుగుతుందని భావిస్తుంటారు. కానీ అందులో నిజంలేదు. జ్యేష్ఠదేవాని చిత్తశుద్ధితో పూజిస్తే అష్టసిద్దులు లభిస్తాయి. డబ్బుకి ఇబ్బందులు ఉండదు . ధర్మాన్ని పాటించే వారిని జ్యేష్ఠ దేవి కాపాడుతుంది. జ్యేష్ఠా మాసంలో ఎండలు పెరిగి తర్వాత తగ్గుముఖం పడతాయి. జ్యేష్ఠ మాసంలో వసంత రుతువు మారి గ్రీష్మ రుతువు ప్రారంభమవుతుంది.

జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమ అంటారు. వర్షాలు మొదలై ఏర్లు పారడం మొదలై కొత్త పంటలి నాంది పలుకుతారు. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు.ఈ మాసంలో ఎవరి ఇష్ట దైవాన్ని వారు పూజించడం చేయవచ్చు.బ్రహ్మదేవుడికి జ్యేష్ట మాసం ఎంతో ఇష్టమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. జ్యేష్ట ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడట. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


వరుడు ఇంట్లో జ్యేష్ఠ పుత్రుడు అయి, వధువు నివాసంలో జ్యేష్ఠ పుత్రికను ఇచ్చి ఈ జ్యేష్ఠ మాసంలో పెళ్లిళ్లు చేయకూడదని పెద్దలూ చెబుతుంటారు. అలాగే అబ్బాయి, అమ్మాయి ఇద్దరిది జన్మనక్షత్రం జ్యేష్ఠ అయినా వారివురికి ఈ మాసంలో అసలు పెళ్లి తలపెట్టకూడదు. త్రి జ్యేష్ఠ ఎప్పుడు కలగకూడదు. అది మాసమైన, జన్మ నక్షత్రం అయినా పెళ్ల్లిలకు పనిచేయదు. అలాగే జ్యేష్ఠ మాసంలో ఇళ్లు కట్టకూడదంటారు.భూముల్ని తవ్వకూడదు. ఈమాసంలో తవ్వితే విష వాయువులు లాంటివి వెలువడే అవకాశం ఉంది. అందుకే ఈ సీజనో ఇల్లు కట్టకూడదని చెప్పడానికి కారణమిదే.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×