BigTV English

Subrahmanya Swamy : సర్పరూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఎలా వచ్చారు?

Subrahmanya Swamy : సర్పరూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఎలా వచ్చారు?


Subrahmanya Swamy : కుమార స్వామి సుబ్రహ్మణ్యస్వామి అయ్యారంటే పాము అయ్యారని అర్థం. సర్పరూపంలో మారడానికి ఒక కారణం ఉంది. పూర్వం శ్రీశైలం క్షేత్రానికి కుమారస్వామి వెళ్లారు. తల్లిదండ్రుల చుట్టూ తిరగడంత గణపతికి భూ ప్రదక్షణం చేసినంత పుణ్యం కలిగింది. దాంతో గణపతి ఆదిదేవుడు అయ్యాడు. గణాధిపతి కావడానికి ఇది ఎంతో ఉపయోగపడింది. ఇదంతా కుమారస్వామికి ఆలస్యంగా తెలిసింది. గణాధిపతిగా పట్టాభిషేకం కూడా జరిగిపోవడంతో తనను తెలియకుండానే చేయడంపై అలిగిన కుమారస్వామి భూమి మీదకి వచ్చిన ప్రాంతం ఈ శ్రీశైలం క్షేత్రం. తనను వంచించి అన్నగారికి పదవి ఇచ్చారన్న కోపంతో తల్లిదండ్రులు విడిచి మరీ ఈ ప్రాంతానికి వచ్చాడు.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైలం రావడానికి కారణం కుమారస్వామే అంటారు. వెంట తీసుకు వెళ్లడానికి శివుడు రెండు రూపాలలో ఇక్కడి వచ్చాడట. ఒక వృద్ధరూపం, మరోటి పడుచు వ్యక్తి రూపం. వృద్ధరూపంలో ఉన్న శ్రీశైలంలో వృద్ధ మల్లిఖార్జున లింగం, లోపల మల్లిఖార్జున లింగం దర్శనమిస్తుంటాయి. ఆ ప్రాంతానికి వచ్చి కాపురం పెట్టిన సమయంలో ఆదిశేషుడి మనవరాలు వల్లిని ఓ చెంచు రాజు పెంచుకున్నాడట. కుమారస్వామి అడవుల్లో తిరిగే సమయంలో వల్లిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెంచురాజును అడిగాడట. అప్పుడు ఆయన తన కూతురు పామని కాబట్టి సర్పరూపంలో ఉన్న వారిని పెళ్లిచేసుకుంటానని చెప్పిందన్నారు. ఆ వెంటనే వల్లి కోసం కుమరస్వామి కూడా సర్ప అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. అది కూడా మార్గశిర షష్ఠి రోజునే అది జరిగింది.


ఆ రోజునే ఇద్దరికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పాము రూపంలోనే మారిన తర్వాతే ఇదంతా జరిగింది. సర్పం అనేది బ్రహ్మజ్ఞానానికి ప్రతీకలాంటింది. నాడు సుబ్రహ్మణశ్వరుడు అనే బిరుదును కుమారస్వామికి వల్లీ అసలు తండ్రి ఇచ్చాడు. పెళ్లి కోసం కుమారస్వామి తన జాతిని మార్చుకుని సుబ్రహ్మణ్యేశ్వరుడిగా అవతరించాడు. భార్య కోసం చేసిన త్యాగంతో ఆయన ఆదర్శమూర్తిగా మారారు. భక్తులతో రెండు పేర్లతో పూజలు అందుకుంటున్నాడు.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×