BigTV English

Temple Shadow : దేవాలయం నీడ ఇంటిపై పడకూడదా..?

Temple Shadow : దేవాలయం నీడ ఇంటిపై పడకూడదా..?

Temple Shadow : హైదరాబాద్ లాంటి ప్రాంతంలో గజం భూమి కూడా వదిలే పరిస్థితి లేదు. ఇంటికి మూడు వైపు జాగా వదిలే అవకాశం లేదు. మరి సిటీలో చాలా చోట్ల ఇళ్ల మధ్యలో గుడులు కనిపిస్తుంటాయి. గుడిని ఆనుకునే ఇళ్లు, దుకాణాలు కట్టి వ్యాపారాలు కూడా
చేస్తుంటారు. అసలు దేవాలయం నీడ ఇంటిపై పడకూడదని అంటారు. మరి ఈ ఆచారంలో నిజమెంత…


దేవాలయానికి దగ్గరలో ఇల్లు ఉండడం వల్ల భగవంతుని స్త్రోత్రాలు, మంగళశాసనాలు ఎప్పుడూ వినబడుతూ మంగళకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. గుడి దగ్గర్లో ఇల్లు ఉండొచ్చు… కాని గుడి పక్కనే మాత్రం నివాసించకూడదని కొందరు అంటారు.

నిత్యం అగ్నితో వెలిగే హోమ గుండానికి సమీపంగా ఎవరైనా ఎదురుగా కూర్చోలేరు. ఆ వేడిని తట్టుకోలేక అక్కడ ఉండలే. అలాగే దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండకపోవడం కూడా అటువంటిదే. దేవాలయం పవిత్ర స్థలమే కాదు . శాస్త్ర ప్రకారం నిర్మించబడే శక్తి కేంద్రాలు కూడా. శక్తిని ప్రేరేపించే జపాలు, హోమాలు,యాగాలు నిత్యం ఆలయాల్లో చేస్తూ ఉంటారు. అందుకే దేవాలయాల నీడ పడే చోట ఇల్లు కట్టుకోకూడదంటారు.


వాస్తు ప్రకారం శివాలయానికి వైష్ణవాలయానికి వెనుక వైపు ఆనుకుని ఇల్లు అస్సలు కట్టుకూడదు. శక్తి ఆలయాలకు 200 అడుగుల మేర ఇల్లును నిర్మించుకోకూడదు. అలా చేస్తే ఆ ఇంటిలో దారిద్ర్యం తాండవిస్తుంది. శివాలయానికి అతీ సమీపంలో గృహాలు ఉంటే వారికి శత్రు భయం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటికి ఉత్తరానగానీ, వాయువ్యంలో గానీ 200 అడుగుల లోపల వినాయకుని ఆలయం ఉన్నట్లయితే ఆ ఇంటి వారికి ధన, నష్టం, అవమానాలు కలుగుతాయి.

Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×