BigTV English
Advertisement

CM Revanth Reddy: హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్

CM Revanth Reddy: హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్

CM Revanth Reddy: తెలంగాణ ఐటీ రంగంలో మరో కీలక అభివృద్ధి చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ (AWS) ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో AWS గ్లోబల్ డేటా సెంటర్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్‌ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న AWS డేటా సెంటర్ ప్రాజెక్టులు, వాటి విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.


ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఐటీ, డేటా సెంటర్, క్లౌడ్ టెక్నాలజీ రంగాల్లో ముందంజలో కొనసాగుతోందని తెలిపారు. హైదరాబాదును డిజిటల్ ఇండియా విప్లవానికి కేంద్ర బిందువుగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమెజాన్ లాంటి గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంలో మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభించేందుకు.. ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

AWS ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణలో మౌలిక వసతులు, విద్యుత్, కనెక్టివిటీ, నైపుణ్య వనరులు అత్యుత్తమంగా ఉన్నాయని, అందుకే హైదరాబాద్‌ను డేటా సెంటర్‌ల ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న డేటా సెంటర్ ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయని, విస్తరణకు సంబంధించిన తదుపరి దశల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.


రాష్ట్రం డిజిటల్ ఎకానమీని వేగవంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, డేటా సెంటర్‌ల విస్తరణతోపాటు హైపర్‌స్కేల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తెలంగాణ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న టాలెంట్ పూల్‌ను AWS వంటి సంస్థలు వినియోగించుకోవచ్చు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంలో మీ భాగస్వామ్యం కీలకం అవుతుంది అని సీఎం పేర్కొన్నారు.

సమావేశంలో AWS ప్రతినిధులు పలు సాంకేతిక అంశాలను, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఎనర్జీ ఎఫిషెన్సీ, సస్టైనబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై కూడా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం పునరుత్పత్తి శక్తి వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నదని, ఆ దిశగా AWS ప్రాజెక్టులు కూడా ముందడుగు వేస్తాయని ప్రతినిధులు చెప్పారు.

Also Read: మంత్రి అజారుద్దీన్ కు కేటాయించిన శాఖలు ఇవే

ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం, AWS మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలపడనుందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాదును డేటా సెంటర్ హబ్‌గా మార్చడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుంది.

Related News

Fee Reimbursement: ఫీజు రియింబర్స్‌మెంట్ విధానంపై రేవంత్ సర్కాట్ కమిటీ ఏర్పాటు

BJP – JanaSena: జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన..

TG Govt: అవుట్ సోర్సింగ్ పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో ఏడాది సర్వీస్ పొడిగింపు

Weather News: రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు

Hydra Demolitions: మేడ్చల్‌లో హైడ్రా కూల్చివేతలు.. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో..

Chevella Bus Accident: చేవెళ్ల-తాండూరు హైవే “డెత్ కారిడార్” అంటూ.. మానవ హక్కుల కమిషన్ కీలక వ్యాఖ్యలు!

Sangareddy: నచ్చని వివాహం చేసుకున్న యువతి.. ఆగ్రహంతో యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి తల్లితండ్రులు

Big Stories

×