Anchor Lasya: లాస్య పరిచయం అవసరం లేని పేరు. మ్యూజిక్ ఛానల్ యాంకర్ గా పరిచయమైన లాస్య తన మాట తీరుతో పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకున్నారు. యాంకర్ గా ఒకానొక సమయంలో ఎంతో బిజీగా ఉంటూ మంచి సక్సెస్ అందుకున్న లాస్య (Lasya)ప్రస్తుతం యాంకరింగ్ కు దూరంగా ఉన్నప్పటికీ, బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ బిజీగానే గడుపుతున్నారు. ఇకపోతే లాస్య ఇటీవల తనకు సంబంధించి శుభవార్తలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొత్త ఇల్లు కొనుగోలు చేసి ఘనంగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇలా తన సొంత ఇంటి కల నెరవేరింది అంటూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు. అయితే తాజాగా ఈమె అభిమానులకు మరొక శుభవార్తను వెల్లడించారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు అందరూ కూడా క్లోతింగ్ బిజినెస్ (Clothing Business) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే లాస్య కూడా ఒక క్లోతింగ్ బిజినెస్ ప్రారంభించారని తెలుస్తోంది తాజాగా ఈ విషయాన్ని ఈమె సాక్షాత్తు ఆ శివయ్య సన్నిధిలో వెల్లడించారు. శివుడి ఆశీస్సులతో మరొక కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్నాము అంటూ ఈమె తన బిజినెస్ కి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
స్వయంగా శివయ్య ఆలయంలో ఈమె తన బిజినెస్ కి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ది కార్డ్ సెట్ స్టూడియోని(The Coord set studio) ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని లాస్య తెలియజేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు బుల్లితెర నటీమణులు కూడా ఇలా డిజైనర్ స్టూడియోస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా లాస్య కూడా బిజినెస్ ప్రారంభించడంతో అభిమానులు కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
?igsh=ZWZ2aXV1OTF0eWc4
ఇక లాస్య వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె మంజునాథ్(Manjunath) అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తన భర్త పిల్లలతో లాస్య వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈమె ఇటీవల వరుస బుల్లితెర కార్యక్రమాలలో తన భర్తతో కలిసి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు సోషల్ మీడియా ద్వారా లాస్య భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇక ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా కొనసాగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4 కంటెంట్ గా లాస్య పాల్గొని సందడి చేశారు. ఇలా బిగ్ బాస్ షో ద్వారా కూడా ఈమె మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు.
Also Read: Jayammu Nischayammuraa: మగవారికి కూడా పీరియడ్స్ రావాలి.. బాధ తెలుస్తుందన్న నటి!