Road Accident: నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్- శ్రీశైలం హైవేపై .. అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారం ప్రకారం.. హాజీపూర్ వద్ద ఒక్కసారిగా పక్క దారి నుంచి లారీ రావడంతో కారు కంట్రోల్ అవకపోవడంతో ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కల్వకుర్తి హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. కారు రూఫ్ పూర్తిగా ఊడిపోయింది. స్థానికుల ఫిర్యాదు తో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.