Bandla Ganesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం నిర్మాతగా సక్సెస్ కొట్టిన వారిలో బండ్ల గణేష్(Bandla Ganesh) ఒకరు. ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈయన ఇటీవల కాలంలో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. బండ్ల గణేష్ ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ నిత్యం ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా సినిమా వేడుకలలో పాల్గొంటున్న బండ్ల గణేష్ ఇండస్ట్రీ గురించి, ఇతర సెలెబ్రెటీల గురించి ఈయన చేసే వ్యాఖ్యల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు.
ఇకపోతే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ తాను త్వరలోనే నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నానని వెల్లడించారు. ఈయన నిర్మాణ సారథ్యంలో ఏ హీరోతో కం బ్యాక్ ఇవ్వబోతున్నారనే విషయంపై ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా బండ్ల గణేష్ సినిమాకి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈయన తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో కంబ్యాక్ ఇవ్వబోతున్నారని సమాచారం. చిరంజీవిని ఎంతో అభిమానించే ఒక అభిమానిగా తన నిర్మాణంలో చిరంజీవితో సినిమా చేయాలని బండ్ల గణేష్ ఎప్పటినుంచో ఆశపడుతున్నారని తెలుస్తోంది.
ఇదే విషయం గురించి చిరంజీవి దగ్గర ప్రస్తావనకు తీసుకురావడంతో చిరంజీవి బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మంచి కథ ఉంటే కచ్చితంగా సినిమా చేస్తానని హామీ ఇవ్వడంతో బండ్ల గణేష్ సైతం బాస్ కోసం అద్భుతమైన కథల ఎంపిక వేటలో పడ్డారని ఇండస్ట్రీ సమాచారం. మరి బండ్ల గణేష్ చిరంజీవి సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే బండ్ల గణేష్ ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం ఉంది.
చిరంజీవి కోసం సింహాసనం..
ఇక మెగా కుటుంబం అంటే బండ్ల గణేష్ ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల గణేష్ ఇంట నిర్వహించిన దీపావళి వేడుకలలో భాగంగా బాస్ కోసమే ప్రత్యేకంగా ఒక సింహాసనం తయారు చేయించడంతోనే చిరంజీవి పట్ల బండ్ల గణేష్ కి ఏ విధమైనటువంటి అభిమానం ఉందో స్పష్టమవుతుంది. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం బాబి, శ్రీకాంత్ ఓదెల సినిమాలను కూడా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read: The Raja saab: ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చిన రాజా సాబ్ టీమ్.. నిరీక్షణ తప్పదా?