మోటో కంపెనీ G సిరీస్ లో భాగంగా Moto G67 పవర్ 5G నవంబర్ 5న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు, కలర్స్ తో పాటు దాని హార్డ్ వేర్ స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. Moto G67 పవర్ 5G 7,000mAh బ్యాటరీతో పాటు స్నాప్ డ్రాగన్ 7 సిరీస్ చిప్ సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ హ్యాండ్ సెట్ రెండు స్టోరేజ్ వేరియంట్లు, మూడు కలర్ వేస్ లో అందుబాటులోకి రానుంది.
Moto G67 పవర్ 5G మోటరోలా ఇండియా వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. కొత్త ఎంట్రీ ప్రకారం ఈ హ్యాండ్ సెట్ భారత్ లో 8GB+128GB, 8GB+256GB కాన్ఫిగరేషన్ లలో అందుబాటులో ఉంటుంది. ఇది మూడు పాంటోన్ క్యూరేటెడ్ రంగులలో అందుబాటులోకి రానుంది. పారాచూట్ పర్పుల్, బ్లూ కురాకో, సిలాంట్రో కలర్స్ లో లభిస్తుంది. Moto G67 పవర్ 5G ఫ్లిప్ కార్ట్ తో పాటు Motorola ఇండియా ఆన్ లైన్ స్టోర్ ద్వారా అమ్మనున్నట్లు తెలుస్తోంది.
Motorola ఇండియా వెబ్ సైట్ లో చూసినట్లుగా, రాబోయే Moto G67 పవర్ 5G Android 15తో రానుంది. డ్యూయల్ సిమ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్ సెట్ పూర్తి HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 391ppi పిక్సెల్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.7-అంగుళాల LCD స్క్రీన్ తో అమర్చబడి ఉంటుంది. స్క్రీన్ HDR10+కి కూడా సపోర్ట్ చేస్తుంది. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ MIL-810H మిలిటరీ గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్, IP64 రేటెడ్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది. Moto G67 పవర్ 5G క్వాల్ కామ్ ఆక్టా కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్ సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఇది అడ్రినో GPU, 8GB RAM, 256GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇది RAM బూస్ట్ ద్వారా 24GB వరకు RAM విస్తరించుకునే అవకాశం ఉంటుంది.
ఇక ఆప్టిక్స్ కోసం, Moto G67 పవర్ 5G ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది, ఇది 50-మెగాపిక్సెల్ (f/1.8) సోనీ LYT-600 మెయిన్ సెన్సార్ తో ఉంటుంది. ఇది 8-మెగాపిక్సెల్ (f/2.2) అల్ట్రావైడ్ కెమెరా, వెనుక భాగంలో టూ ఇన్ వన్ ఫ్లికర్ కెమెరాను కలిగి ఉంటుంది. హోల్ పంచ్ కటౌట్ లోపల ఉంచబడిన ఈ హ్యాండ్ సెట్ లో 32 మెగాపిక్సెల్ (f/2.2) ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఆన్‌బోర్డ్ సెన్సార్ల లిస్టులో ఫింగర్ ప్రింట్ స్కానర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, SAR సెన్సార్, ఇ-కంపాస్ ఉంటాయి. స్టీరియో-స్పీకర్ యూనిట్ డాల్బీ అట్మాస్, గూగుల్ జెమిని AI వాయిస్ అసిస్టెన్స్ కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం Moto G67 పవర్ 5G 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS, GLONASS, గెలీలియో, QZSS, బీడౌలకు సపోర్ట్ చేస్తుంది. ఇది 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Read Also: త్వరలో లావా అగ్ని 4 లాంచింగ్.. డిజైన్, స్పెసిఫికేషన్లు అదుర్స్ అంతే!