OTT Movie: సైకో కిల్లర్ అనే పేరు వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. వీళ్ళు చేసే ఆరాచకాలకు ఇక హద్దు ఉండదు. దెయ్యాలు కూడా చేయని హింసని వీళ్ళు చిటికెలో చేసేస్తుంటారు. ఇక ఇలాంటి సినిమాలకు కూడా ఓటీటీలో కొదవ లేదు. ఇప్పడు చెప్పుకోబోయే సినిమా రివేంజ్ థీమ్ లో రూపొందింది. ఒక మహిళా సైకో జైలు నుంచి ఇరవై సంవత్సరాల తరువాత తప్పించకుని, ఒక యువతిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. క్లైమాక్స్ మరింత ఉత్కంఠంగా నడుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు ఈ మూవీ బెస్ట్ సజెషన్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ది గర్ల్ హూ గాట్ అవే’ (The Girl Who Got Away) అనే థ్రిల్లర్ సినిమాని మైఖేల్ మోరిస్సీ తెరకెక్కించారు. ఇందులో లెక్సీ జాన్సన్ ,కే టకర్‌మన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2021లో విడుదలైన ఈ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోఅందుబాటులో ఉంది.
న్యూయార్క్ పట్టణంలో ఎలిజబెత్ అనే సీరియల్ కిల్లర్, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి, వాళ్లను చంపేస్తూ ఉంటుంది. ఆమె ఇల్లు ఒక జైలులా ఉంటుంది. ఆమె కిడ్నాప్ చేసిన పిల్లల్ని బేస్ మెంట్‌లో బంధిస్తుంటుంది. వాళ్లకు కొత్త పేర్లు పెడుతుంది. ఆమె వాళ్ళకు తల్లి అని చెప్పి నమ్మించి హింసిస్తుంది. ఒక రోజు ఆమె బంధించిన ఐదుగురు పిల్లల్లో కేటీ అనే పిల్ల తప్పించుకుంటుంది. మిగతా నలుగురి మృతదేహాలు ఆమె ఇంటి వెనుక ఖననం చేయబడి ఉంటాయి. ఆ తరువాత పోలీసులు ఎలిజబెత్‌ను అరెస్ట్ చేస్తారు. ఆమెను చనిపోయేవారకు జైలులో వుండేటట్లు శిక్ష వేస్తారు. 20 సంవత్సరాల తర్వాత కేటీ ఇప్పుడు ఒక టీచర్ గా ఉంటుంది. ఆమె తన గతం గురించి ఎవరికీ చెప్పదు.
Read Also : ఇన్ సెక్యూర్ అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో… కితకితలు పెట్టే తమిళ కామెడీ మూవీ
ఆమెకు ఇప్పుడు ఆరన్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. కానీ ఆమెను గతం ఇంకా వెంటాడుతూనే ఉంటుంది. ఇంతలో ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది. ఎలిజబెత్ జైలు నుంచి తప్పించుకుందన్న విషయం తెలిసి కేటీ భయపడుతుంది. ఆమె దగ్గరికి ఒక డిటెక్టివ్ వచ్చి, ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తాడు. కేటీని వెతుకుతూ ఎలిజబెత్ పట్టణంలోకి వస్తుంది. ఆమె ముందుగా ఆరన్‌ను చంపేస్తుంది. ఆ తరువాత కేటీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కథలో భారీ ట్విస్ట్ వస్తుంది. ఈ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? కేటీని కూడా ఎలిజబెత్ చంపుతుందా ? ఇరవై సంవత్సరాల కేటీ వెంట ఎందుకు పడుతోంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.