Haris Rauf: పాకిస్తాన్ స్టార్ బౌలర్ హారిస్ రవూఫ్ కు (Haris Rauf) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హారిస్ రవూఫ్ పై వేటు వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఏకంగా రెండు మ్యాచ్ లు ఆడకుండా హారిస్ రవూఫ్ పై నిషేధం విధించింది ఐసీసీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) సందర్భంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా అభిమానులను ఉద్దేశించి, ఇండియా మిస్సైల్స్ ను పేల్చేసినట్లు హారిస్ రవూఫ్ సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వెంటనే ఐసీసీకి (ICC) ఫిర్యాదు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ). అయితే ఈ అంశంపై నెలరోజుల తర్వాత యాక్షన్ తీసుకుంది ఐసీసీ.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడు సార్లు మ్యాచ్ జరిగింది. రెండుసార్లు లీగ్ దశలో రెండు జట్లు పోటీ పడగా, ఫైనల్స్ లో కూడా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఫైనల్స్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో తొమ్మిదవ సారి ఆసియా కప్ గెలిచిన జట్టుగా టీమిండియా నిలిచింది. అయితే లీగ్ దశలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా పాకిస్తాన్ స్టార్ బౌలర్ హారిస్ రవూఫ్ వివాదాస్పద సైగలు చేశాడు.
ఇండియన్ అభిమానులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడు. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో… భారత్ కు చెందిన 6 మిస్సైల్స్ మేము పెళ్లి చేశామని, హారిస్ రవూఫ్ సైగలతో తెలిపాడు. ఇండియాపైన మేమే విజయం సాధించామన్న రేంజ్ లో రెచ్చిపోయాడు. అయితే ఈ అంశంపై వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. దీంతో తాజాగా ఐసీసీ యాక్షన్ తీసుకుంది. భారత అభిమానులను రెచ్చగొట్టినందుకుగాను రెండు మ్యాచ్ లు ఆడకుండా బ్యాన్ విధించింది ఐసీసీ. హారిస్ రవూఫ్ కు రెండు మ్యాచ్ ల బ్యాన్, 30 శాతం ఫైన్, 2 పెనాల్టీ పాయింట్లు విధించారు.
హారిస్ రవూఫ్ తో పాటు సూర్యకు ఝలక్ ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఆసియా కప్ సందర్భంగా షేక్ హ్యాండ్ ఇవ్వనందుకు గానూ, 30 శాతం ఫైన్, 2 పెనాల్టీ పాయింట్లు విధించారు. అటు సాహిబ్జాదా ఫర్హాన్
గన్ సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు గానూ వార్నింగ్ తో పాటు 1 పాయింట్ పెనాల్టీ విధించారు. బుమ్రా కూడా హారిస్ వికెట్ తీసి, రెచ్చిపోయాడు. దీంతో బుమ్రాకు వార్నింగ్ తో పాటు 1 పాయింట్ పెనాల్టీ విధించారు.
🚨 ICC BANNED HARIS RAUF 🚨
– ICC has banned Haris Rauf for two matches for his gestures during the Asia Cup match against India. pic.twitter.com/mwOWVAc8gK
— Sheri. (@CallMeSheri1_) November 4, 2025