E-Paper
Advertisement

Raksha Bandhan: రాఖీ పౌర్ణమి రోజు అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారి కష్టాలు తొలగిపోయే టైమ్ వచ్చేసింది.

Raksha Bandhan: రాఖీ పౌర్ణమి రోజు అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారి కష్టాలు తొలగిపోయే టైమ్ వచ్చేసింది.
Advertisement

Raksha Bandhan: రాఖీ పౌర్ణమి రోజు చంద్రుడు, శని చంద్రుల కలయిక జరగనుంది. రాఖీ పౌర్ణమి రోజు ఏర్పడబోయే అనేక శుభ యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శని అనుగ్రహంతో కొన్ని రాశుల వారి జీవితంలో ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రక్షాబంధన్ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకుంటాము.

ఈ ఆగస్ట్ 19వ తేదీన రాఖీ పౌర్ణమి జరుపుకోనున్నాము. రాఖీ పండగ సందర్భంగా అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. అంతే కాకుండా గ్రహాల కదలికలో మార్పులు కూడా రానున్నాయి. అరుదైన రాజయోగాలు కూడా ఏర్పడనున్నాయి. దృక్ పంచాంగం ప్రకారం సిద్ధి యోగం, సౌభాగ్య యోగం, శోభన యోగాలు రాఖీ పండగ రోజు ఏర్పడనున్నాయి. చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్చుకుంటాడు. ఇలా రక్షా బంధన్ రోజున చంద్రుడు శని రాశిలో సంచరిస్తాడు.

Advertisement

దీని కారణంగా కొన్ని రాశుల వారిపై పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అంతే కాకుండా శని ప్రత్యేక ఆశీర్వాదాలు కూడా వీరు పొందుతాడు. ఆగస్టు 18 నుంచి శని తన నక్షత్రాన్ని మార్చుకుంటాడు. పూర్వభాద్ర నక్షత్రంలో శని ప్రవేశిస్తాడు. రాఖీ పౌర్ణిమ రోజు శుభ యోగాల వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: రాఖీ పండగ రోజు మేష రాశి వారికి శుభ ప్రదంగా ఉంటుంది. శని, చంద్రుల కలయిక వల్ల ఈ రాశి వారి కెరీర్ పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి. శని దేవుడి అనుగ్రహం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు కూడా పొందుతారు. సమాజంలో హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. అంతే కాకుండా కుటుంబ జీవితంలో సంతోషం, శాంతి కూడా పెరుగుతుంది.

Advertisement

కుంభ రాశి: ప్రస్తుతం కుంభ రాశి వారికి శశి యోగం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా రాఖీ పండగ రోజు అరుదైన గ్రహాల కలయిక వల్ల మీ అదృష్టం కలసివస్తుంది. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బాగా పెరుగుతాయి. చాలా కాలంగా ఉన్న పనులు కూడా విజయవంతం అవుతాయి. ఆర్థక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఎక్కువగా ఉంది.

ధనస్సు రాశి: రాఖీ పండగ రోజు అరుదైన గ్రహాల కలయిక వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అంతే కాకుండా శని దేవుడి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ప్రతి రంగంలోనూ కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఉద్యోగ , వ్యాపార అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రాఖీ పండగ రోజు శుభ వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×