Big Stories

Annaprasana : అన్నప్రాశన ఆరో నెలలోనే చేయాలంటారు.. ఎందుకు?

Annaprasana : అన్నప్రాశన ఆరో నెల ఆరో రోజున చేయటం ఆచారం. ఆ రోజు చేసేప్పుడు ముహూర్తంతో పని లేదు అని ఒక పెద్ద వాదన ఉంది. అయితే అది చాలా తప్పుడు వాదన. కారణం ఆరో నెల ఆరో రోజు, అమావాస్య కానీ, మంగళవారం కానీ గ్రహణం కానీ వస్తే అన్నప్రాశన చేయరు. పిల్లలకి సంబంధించి చేసే కార్యాలకు మూఢమి కర్తరీ వంటివి చూడనవసరం లేదు అని చెప్పారు. సీమంతం, పుంసవనం, జాతకర్మ, నామకరణం, ఊయలలో వేయుట అన్నప్రాశన వంటివి నెలల ఆధారంగా చేసే కార్యములు.

- Advertisement -

యాజ్ఞవల్కుడు చెప్పిన కారణంగా నాల్గవ మాసం ఆరో మాసం, ఎనిమిది మాసాలలో హోమ ప్రాధాన్యంగా చేయు సీమంత కార్యమునకు మూఢమి పట్టింపులేదు. ఇలాగే అన్ని శిశు కార్యములకు నెల పట్టింపు మాత్రమే వున్నది కానీ ముహూర్త సంబంధం లేకుండా ఏ పనీ చేయమని జ్యోతిష్య శాస్త్రం చెప్పలేదు.

- Advertisement -

పునర్వసు, మృగశిర, ధనిష్ఠ, పుష్యమి, హస్త, స్వాతి, అశ్వినీ, అనురాధ, శ్రవణం, శతభిషం, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, చిత్త నక్షత్రములు వున్న సమయంలో సోమ, బుధ, గురు, శుక్ర వారములు, తప్పనిసరి అయితే శని ఆదివారములలో అష్టమ స్థానములో పాప గ్రహములు లేకుండాను, ముహూర్త సమయానికి వున్న లగ్నానికి పాపగ్రహ సంబంధం లేకుండా చూసి ముహూర్తం చేయమని, అన్నప్రాశన చేయవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

ఒకవేళ ఆరో నెల ఆరో రోజు, వాదన సబబే అయితే ఏ విధమైన జ్యోతిష గ్రంథాలలోను ఈ విషయం ఎందుకు రాయలేదు. కేవలం మూఢమి పట్టింపు లేదు అన్నారు కానీ ముహూర్త పట్టింపు లేదు అనే వాదన చాలా దోష వాదన. అన్నప్రాశన ముహూర్త ప్రభావం పిల్లవాడి జీవిత ఆరోగ్య విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన తప్పకుండా మంచి ముహూర్తానికే అన్నప్రాశన చేయాలి. .

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News