Big Stories

BJP: నిరుద్యోగ మార్చ్ సక్సెస్.. ఇక, మిలియన్ మార్చ్.. బీజేపీ ఫుల్ జోష్..

BANDI-SANJAY

BJP: కేసీఆర్ ను గద్దె దించితేనే.. నిరుద్యోగుల రాత మారుతుందని.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. లక్షకు పైగా ఖాళీలున్నా.. అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చెప్పారని ఆరోపిచారు. ఎన్నికలు వచ్చినప్పుడే నోటిఫికేషన్లు విడుదల చేసి.. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని.. దాన్ని తెలిపేందుకే నిరుద్యోగ మార్చ్ నిర్వహించినట్లు.. బండి సంజయ్ తెలిపారు.

- Advertisement -

నిరుద్యోగ మార్చ్‌ ఆగదని.. ఈనెల 21న పాలమూరు గడ్డపై నిరుద్యోగ మార్చ్‌ ఉంటుందని చెప్పారు. 10 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తామని.. భాగ్యనగర్ గడ్డపై నిరుద్యోగులతో మిలియన్ మార్చ్ చేపడతామని బండి సంజయ్ సమరశంకం పూరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలన్నీ భర్తీ చేస్తుందని.. ప్రతీ ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

కేసీఆర్‌ కుటుంబానికో న్యాయం.. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకో న్యాయమా? అని ప్రశ్నించారు బండి సంజయ్. పేపర్‌ లీకేజీ ఘటనలో మంత్రి కేటీఆర్‌ను ఎందుకు బర్తరఫ్ చేయట్లేదని నిలదీశారు. మీ తప్పులేకుంటే సిట్టింగ్‌ జడ్జీతో ఎందుకు విచారణ జరిపించడం లేదని విమర్శించారు.

30 లక్షల మంది యువత కోసం బీజేపీ కొట్లాడుతోంది. పరీక్షలు రాసిన అభ్యర్థులందరికీ లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి మాట్లాడలేదని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే నోటిఫికేషన్లు ఇస్తున్నారని.. ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం టైమ్‌పాస్‌ చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని.. ఆ పరీక్షల్లో ఎలాంటి తప్పులు జరగడం లేదని చెప్పారు.

మరోవైపు, నిరుద్యోగ మార్చ్ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయంలోకి వెళ్లేందుకు కొందరు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా.. పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

అంతకుముందు, హన్మకొండలో బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్‌కు పోలీసులు అనేక నిబంధనలు విధించారు. కాకతీయ యూనివర్సిటీ జంక్షన్‌ నుంచి హనుమకొండ అంబేద్కర్‌ విగ్రహం వరకు షరతులకు కట్టుబడి మార్చ్ చేపట్టేందుకు పర్మిషన్ ఇచ్చారు. నిరుద్యోగ ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. మార్గమంతా యువతతో కిక్కిరిసిపోయింది. బండి సంజయ్‌తో సెల్ఫీలు దిగేందుకు యువకులు పోటీపడ్డారు. మార్చ్.. సీపీ కార్యాలయం దగ్గరకు రాగానే.. కొందరు లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోటీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మొత్తానికి నిరుద్యోగ మార్చ్ గ్రాండ్ సక్సెస్ అయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News