E-Paper
Advertisement

Solar eclipse: ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం..ఇండియాలో కనిపిస్తుందా? పూర్తి వివరాలు ఇవే!

Solar eclipse:  ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం..ఇండియాలో కనిపిస్తుందా? పూర్తి వివరాలు ఇవే!
Advertisement

Solar eclipse 2026: ఈ ఏడాది ఏర్పడనున్న మొట్టమొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న జరగబోతోంది. దీనిని ‘కంకణాకార సూర్యగ్రహణం’ లేదా ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్యలోకి వచ్చినప్పుడు సూర్యబింబం ఒక బంగారు వలయంలా కనిపించడమే దీని ప్రత్యేకత. ఈ అరుదైన దృశ్యాన్ని చూడాలని అందరూ ఆరాటపడుతున్నారు. అయితే.. ఈ గ్రహణం మన దేశంలో కనిపిస్తుందా ? ఏ సమయాల్లో ఈ మార్పులు చోటుచేసుకుంటాయి ? గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వంటి అంశాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యగ్రహణం అంటే ఏంటి?

Advertisement

శాస్త్రీయంగా చెప్పాలంటే.. చంద్రుడు సూర్యుడికి , భూమికి మధ్యలోకి వచ్చినప్పుడు, చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. దీని వల్ల సూర్యుడు మనకు పాక్షికంగా లేదా పూర్తిగా కనిపించకుండా పోతాడు. ఈ ప్రక్రియనే.. సూర్యగ్రహణం అంటారు. ఫిబ్రవరి 17న జరగబోయేది ‘కంకణాకార సూర్యగ్రహణం’ . అంటే ఈ సమయంలో చంద్రుడు భూమికి కాస్త దూరంగా ఉండటం వల్ల సూర్యుడిని పూర్తిగా కప్పివేయలేడు. ఫలితంగా సూర్యుడు మధ్యలో నల్లగా, అంచుల్లో ప్రకాశవంతమైన వలయంలా కనిపిస్తాడు.

ఇండియాలో కనిపిస్తుందా?
ఖగోళ శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 17న సంభవించే ఈ కంకణాకార సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు. దీని ప్రధాన ప్రభావం అంటార్కిటికా మరియ, దక్షిణ హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ గ్రహణం కనిపించదు కాబట్టి.. ఇక్కడ జ్యోతిష్య శాస్త్ర పరంగా ఎలాంటి ‘సూతక కాలం’ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. దేవాలయాలు కూడా యధావిధిగా తెరిచే ఉంటాయి.

Advertisement

గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఈ అద్భుత దృశ్యం ప్రధానంగా అంటార్కిటికా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పాక్షిక గ్రహణాన్ని మాత్రం దక్షిణ అమెరికాలోని కొన్ని భాగాలు (చిలీ, అర్జెంటీనా), దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వే, మారిషస్ , నమీబియా వంటి దేశాల్లో చూడవచ్చు.

గ్రహణం వివరాలు:
పాక్షిక గ్రహణం ప్రారంభం: మధ్యాహ్నం 12:31 గంటలకు
కంకణాకార గ్రహణం: మధ్యాహ్నం 1:42 గంటలకు (అంటార్కిటికాలో)

గ్రహణం ముగింపు: సాయంత్రం సుమారు 5:27 గంటలకు

Also Read: అసలు ఏంటి ఈ బ్లూ టర్మరిక్? మనకు తెలిసిన పసుపు కంటే ఇది భిన్నమైందా?

చిట్కాలు:
గ్రహణం మన దేశంలో కనిపించకపోయినా.. ఒకవేళ మీరు గ్రహణం కనిపించే ప్రాంతాల్లో ఉన్నా లేదా ఆన్‌లైన్ ద్వారా లైవ్ చూస్తున్నా ఈ విషయాలు గుర్తుంచుకోవాలి
నేరుగా చూడకండి: సూర్యగ్రహణాన్ని ఎప్పుడూ నేరుగా కళ్లతో చూడకూడదు. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన పరారుణ, అతినీలలోహిత కిరణాలు కంటి చూపును శాశ్వతంగా దెబ్బతీస్తాయి.

సర్టిఫైడ్ గ్లాసెస్: సాధారణ సన్ గ్లాసెస్ గ్రహణం చూడటానికి పనికిరావు. దీని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ISO 12312-2 సర్టిఫైడ్ సోలార్ ఫిల్టర్లు లేదా గ్రహణ కళ్లద్దాలను మాత్రమే ఉపయోగించాలి.

కెమెరాలు, టెలిస్కోప్‌లు: కెమెరాలు, బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్‌ల ద్వారా నేరుగా సూర్యుడిని చూడటం ప్రమాదకరం. వాటికి తప్పనిసరిగా సోలార్ ఫిల్టర్లను అమర్చాలి.

పిన్ హోల్ ప్రొజెక్టర్: ప్రత్యక్షంగా చూడటం ఇష్టం లేని వారు ‘పిన్ హోల్ ప్రొజెక్టర్’ పద్ధతి ద్వారా తెల్లటి కాగితంపై సూర్యుడి ప్రతిబింబాన్ని పడేలా చేసి గ్రహణాన్ని చూడవచ్చు.

పిల్లల విషయంలో జాగ్రత్త: గ్రహణాన్ని చూసే సమయంలో పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. వారు పొరపాటున కూడా అద్దాలు లేకుండా సూర్యుడి వైపు చూడకుండా జాగ్రత్త వహించాలి.

ఇండియాలో ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా.. నాసా (NASA) వంటి అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ దృశ్యాన్ని చూడొచ్చు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×