Fake Silver Coins: స్వేచ్ఛ బ్యూరో; అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ(BJP) పార్టీ 5 వ వార్డు అభ్యర్థి మాలతి మాధవరెడ్డి(Malathi Madhava Reddy) నకిలీ వెండి నాణేలను పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ బిఆర్ఎస్(BRS) పార్టీ దశరథ్(Dasharatha) ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు దశరథ్ మాట్లాడుతూ.. ఓటర్లను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మేడ్చల్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌కు ఓటర్లు క్రమంగా తరలి వస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది. ముడిచింతల్‌పల్లి మున్సిపాలిటీలో ఉదయం 9 గంటల వరకు 15.78 శాతం పోలింగ్ నమోదైంది. అలియాబాద్ మున్సిపాలిటీలో 17.69 శాతం ఓటింగ్ నమోదైంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో 12.99 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటర్ల సౌకర్యార్థం తాగునీరు, నీడ వంటి ఏర్పాట్లు కల్పించారు. అధికారులు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు.
Also Read: OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి హిట్ సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..?
మేడ్చల్ స్వేచ్ఛ :అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాలగడి మలక్‌పేట్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ సందర్శించారు. సునీతమైన ప్రాంతం కావడంతో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఒక పోలింగ్ స్టేషన్ లో 1900 ఓట్లు ఉన్నాయి.2 వార్డులకు సంబంధించి 4 పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.ఉదయం 10.30 గంటల వరకు సుమారు 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ రమేష్ పేర్కొన్నారు.ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రమేష్ కోరారు.ఆయనతో పాటు అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఎసిపి శ్రీనివాస్ రెడ్డి , బాల గంగిరెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు