Arasavalli Temple:రథ సప్తమి సూర్య భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామి పండుగ.
ఈ ఆలయంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ రథ సప్తమి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఉంది.రథ సప్తమి భగవంతుడు సూర్య నారాయణ స్వామి పండుగ, సూర్య జన్మదినంగా భావిస్తారు.
క్రీస్తుశకం ఏడో శతాబ్దంలో కళింగ ప్రాంతాన్ని ఏలిన గంగ వంశపు రాజు దేవేంద్ర వర్మ అరసవల్లిలో సూర్యనారాయణుడి ఆలయాన్ని నిర్మించాడు. మూలవిరాట్టు విగ్రహం అరుదైన అరుణ సాలగ్రామ శిలతో రూపొందింది .ఆలయానికి ఐదు ద్వారాలు ఉన్నాయి. ఆలయం వద్ద పురాతనమైన పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిని దేవేంద్రుడే తన వజ్రాయుధంతో తవ్వినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇందులోనే శ్రీ సూర్యనారాయణస్వామి మూలవిరాట్టు విగ్రహం లభించిందని, దానినే దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించాడని స్కంద పురాణం చెబుతోంది.
అరసవల్లి ఆలయానికి అరుదైన ప్రత్యేకత ఉంది. ఏటా రెండు ఆయనాలలో మూడేసి రోజులు ఆలయానికి గల ఐదు ద్వారాల నుంచి సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్టు పాదాలను తాకుతాయి. ఉత్తరాయణంలో మార్చి 9, 10, 11 తేదీలలోను; దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2, 3 తేదీలలో ప్రాతఃకాలంలో సంభవించే ఈ అరుదైన నయనానందకర విశేషాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు.