Namaskaram : ఎవరైనా ఎప్పుడైనా ఎక్కువ సార్లుగా దక్షిణం వైపు తిరిగి నమస్కారం పెట్టకూడదు అంటారు. అలా అనడం వెనుక చాలా విషయం ఉంది. ఏ కారణం లేకుండా మన పూర్వికీలు మనకు ఇలాంటి నియమాలు పెట్టరు. దక్షిణం వైపు నమస్కారం ఎందుకు పెట్టకూడదంటే దక్షిణమనేది యమధర్మరాజుగారి యొక్క దిక్కు దక్షిణానికి తిరిగి నమస్కారం చేస్తే యమధర్మరాజుగారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. మనిషికి యమధర్మరాజుగారి అనుగ్రహం కలిగితే ఏం జరుగుతుందో తెలిసిందే. ఇకపోతే ఎవరైనా యమధర్మగారి యొక్క సదనాన్ని చేరుకోవాలన్నా శరీరము రోగ గ్రస్తము కావాలన్నా దక్షిణ దిక్కుకు తిరిగి ఎక్కువ నమస్కారం చేయాలి.
రోగం వస్తే బాగుండూ అన్నారనుకోండి దక్షిణ దిక్కుకి ఎక్కువ నమస్కారం చెయ్యాలని పురాణాల్లో ఉంది. అయితే ప్రాణం తీసే యమధర్మరాజుకు మరో శక్తి కూడా ఉంది. అదేమంటే ఆయన అనుగ్రహిస్తే రోగం లేకుండా కూడా చేస్తాడు. సాధారణంగా దక్షిణ దిక్కుకి తిరిగి చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనం మాత్రం ఒక గృహస్తు కోరుకో కూడదు .ఇక నమస్కారం చెయ్యడం ప్రధానం కాదు నమస్కారం చేసేటప్పుడు మీరు నమస్కారం ఎవరికి చేద్దామనుకున్నారో అన్నది ప్రధానం.