
Work In House:- హిందూ మతాచారాల ప్రకారం ఇంటి నిర్మాణంలో వాస్తుశాస్త్రాన్ని అనుసరించి ఇల్లు కట్టుకునే వారి సంఖ్య ఎక్కువ. దేవుడిపై నమ్మకం లేని వారి సంగతి పక్కన పెడితే వాస్తును ఫాలో అయ్యే వారు మాత్రం ఇంటి నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా భావిస్తారు. ఇల్లు కట్టిచూడు… పెళ్లి చేసి చూడు సామెత వెనుక చాలా అర్ధాలు ఉన్నాయి. ఎంత డబ్బు ఉన్న ఇల్లు కట్టేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొవడం చూస్తూనే ఉంటాం. పనులు పక్కాగా మొదలుపెట్టిన కొన్ని సార్లు తప్పులు చేస్తుంటారు. కొన్ని పనులు వాయిదా వేయడం నష్టం జరుగుతుంది. ఇంటి నిర్మాణంలో కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు.
ఇంటిని నిర్మించి ప్రహారీ గోడ లేదా కాంపాండ్ గోడ కట్టకుండా ఆపకూడదని చెబుతున్నారు. అలాగే ఇంటి ముందు భాగంలో మట్టిని నింపే పని మధ్యలో ఆపకుండూ పూర్తి చేయాలి. .మరుగుదొడ్లు నిర్మించినప్పుడు వాటికి డోర్లు కచ్చితంగా పెట్టాలి . అవి వాడకంలో ఉన్నట్టు ఈ పని అసలు వాయిదా వేయకూడదు. కొంతమంది ఇంటిని నిర్మించే ముందు ఇంటికి అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తుంటారు. నిర్మాణానికి ఇబ్బంది లేకపోతే వాటిని అలా ఉంచేయడం మంచిది. కొంతమంది ఇంటి నిర్మాణం పూర్తయ్యాక చెట్లను తొలగిస్తుంటారు. ముఖ్యంగా నైరుతి, ఆగ్నేయం, దక్షిణ దిక్కుల్లో ఉన్న వాటిని అసలు తీయకూడదు.
ఇంటిని నిర్మాణం పూర్తయ్యాక గృహ ప్రవేశం వాయిదా వేయకూడదు. సాధ్యమైనంత తర్వగా గృహ ప్రవేశం చేసుకోవాలి. ప్లోరింగ్ చేసే టప్పుడు కూడా పనులు వాయిదా తగదు. ఎత్తు పల్లాలుగా లేకుండా చేసుకోవాలి. ఇంట్లో గోడలకి ఒక కోటింగ్ తెల్ల సున్నం వేయించాలి. ఫ్లాస్టింగ్ లాంటిది చేయించాలి.
లోపలి గోడలికి వైట్ కలర్ విషయంలో ఆలస్యం కానీ వాయిదా వేయడం కానీ చేయకూడదు. బయట గోడల సున్నం విషయంలో వాయిదా వేసినా పర్వాలేదు. స్లాబు సరిగా లేనప్పుటు పైన ప్లాస్టరింగ్, ఫినిషింగ్ లు వాయిదా కూడదు. అలాగే మేడ మీద ఉన్న పిట్టగోడలు విషయంలో వాయిదా వేయకూడదు. మెట్లపై కూడా గోడ విషయంలో కూడా వాయిదా వేయకుండా పని జరిపించాలి. ముఖ్యంగా బయటి ద్వారాలకు తలుపులు పెట్టించాలి.