
Sun Idol:- సమస్త మానవాళికి వెలుగునిచ్చే సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. ప్రతీరోజు సూర్య నమస్కారం చేస్తే ఆరోగ్యపరంగా మేలు జరుగుతుంది శాస్త్రీయంగా నిరూపితమైంది. అలాంటి సూర్యభగవానుడ్ని ఇంట్లో విగ్రహం రూపంలో పెట్టుకుని కూడా పూజించ వచ్చు. మట్టి లేదా రాయితో చేసిన ఆదిత్యుడ్ని విగ్రహాన్ని మనం నివసించే గృహంలో పెట్టి పూజిస్తే అదృష్టం కలిసి వస్తుంది.
అనుకున్నపనులు నెరవేరుతాయి. కొత్తగా పెళ్లైన వారు రాగితో తయారు చేసిన ఆదిత్యుడ్ని విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తే వైవాహిక జీవితం సాఫీగా, సుఖంగా సాగిపోతుంది. అదే చెక్కతో చేసిన ఆదిత్య విగ్రహాన్ని పూజిస్టేస్తే ఇంట్లో అపరిషృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం.
ఐరన్, గాజు వంటి విగ్రహాలు కానీ ఇంట్లో పెట్టుకుంటే మంచిది కాదు. ఇలాంటి మెటిరీయల్ చేసిన వాటిని పెట్టుకోవడం మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందట. కొన్ని రకాల లోహాలతో చేసి విగ్రహాలు వల్ల ఫలితాలు ఉండవు. ఏ పని అనుకున్నా ముందుకు కదలదు. కుటుంబ సభ్యులకి ఆరోగ్యం అంతగా బాగుండదు. స్వర్ణంతో తయారు చేసిన సూర్యుని విగ్రహాన్ని నిత్యం పూజించగలిగితే వారికి విశేషమైన సంపద కలిసి వస్తుంది. పూజించాలి. దీంతో అమితమైన సంపద కలుగుతుంది.