BigTV English

Vastu Tips for Bed : మంచం కింద ఈ వస్తువులు పెడుతున్నారా…..

Vastu Tips for Bed  : మంచం కింద ఈ వస్తువులు పెడుతున్నారా…..


Vastu Tips for Bed : ప్రతీ ఇంట్లో పడగ గదికి ప్రత్యేక స్థానం ఉంటుంది. రోజంతా కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకునేది అక్కడే. శరీరానికి విశ్రాంతి దొరికేది మంచంపైనే. అలాంటి మంచం విషయంలో కొంతమంది అశ్రద్దతో ఉంటారు. మంచాన్ని కూడా స్టోర్ పాయింట్ లా వాడుతుంటారు. లగేజ్ లాంటి వస్తువుతోపాటు అత్యవసరం కాని వాటిని దాచే స్థానంగా మార్చేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం పడుకునే మంచం విషయంలో కొన్ని పద్దతులు పాటించాలి. మంచం కింద పెట్టే వస్తువులు మనపై నెగిటివ్ ఇంపాక్ట్ ను కూడా కలిగించే అవకాశాలు లేకపోలేదు. కొన్ని వస్తువులు పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొస్తాయి.

చిన్న పసుపు కలర్ బట్ట మధ్యలో పసుపు ఉంచి చిన్న మూటలాగా కట్టి పడుకునే తలగడ లేదా దిండుకు కింద ఉంచితే విశేషంగా ధనలాభం కలుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఎర్రచందనం ముక్కను దిండు కింద పెట్టి నిద్రించడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. సిల్వర్ పిష్ బొమ్మను పిల్లో కింద పెట్టుకుని నిద్రించే వారికి రాజయోగం కలిగే అవకాశం ఉందని పరిహార శాస్త్రం చెబుతోంది. చేప రూపంలోనే శ్రీ మహావిష్ణువు వేదాలను కాపాడాడు. అంతటి విశిష్ట రూపమే మత్య్సావతారం. వెండితో తయారుచేసిన చేపబొమ్మను నీళ్లలో వేసి వాయువ్య దిశలో ఉంచినా లక్ష్మదేవి కటాక్షిస్తుంది. బుధవారం రోజు ఐదు రూపాల కాయిన్ దిండు కింద పెట్టి నిద్రించి మర్నాడే ఆ కాయిన్ పేదవారికి దానం చేస్తే మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఇలా బుధవారం నుంచి ప్రారంభించి 45రోజులు కంటిన్యూగా చేస్తే అప్పుల బాధలు తీరిపోతాయి.


పడుకునే మంచం కింద రాగిపాత్రలో నీళ్లు పోసి రాత్రంతా ఉంచి పొద్దున పూజ
ఆ నీటిని మొక్కలకి పోస్తే మీలో కోపం గుణం పోతుంది. ఆత్మ విశ్వాసం తక్కువ ఉన్న వారికి ఒక పరిహారం ఉంది. మంచం దగ్గర రాత్రిపూట వెండి పాత్రను ఉంచి అందులో నీళ్లు పోసి ఉదయాన్ని మొక్కలు పోస్తే పరిస్థితులు మారిపోతాయి. మీలో మార్పు మొదలవుతుంది. అదే స్టీల్ పాత్రలో నీళ్ల పరిహారం పాటిస్తే దృష్టి దోషాలు పోయి మీరు ఆరోగ్యంగా ఉంటారు. నరపీడ, నరఘోష నివారణకి ఈపరిహారం ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతోంది.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×