E-Paper
Advertisement

wallpaper : ఏ నెంబర్ ను వాల్ పేపర్ గా పెట్టుకుంటే మంచిది?

wallpaper : ఏ నెంబర్ ను వాల్ పేపర్ గా పెట్టుకుంటే మంచిది?
Advertisement

wallpaper : ఈ రోజుల్లో మొబైల్ లేని భూమి మీద కనిపించడేమో అన్నంతగా వాడకం పెరిగిపోయింది . చేతిలో సెల్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు భావించే వాళ్లకి లెక్కే లేదు. నిమిషం కూడా మొబైల్ జేబులో లేదా చేతిలో లేకుండా గడపలేరేమో అన్నంతగా వాడేస్తున్నారు. మరి అలాంటి మొబైల్ లో వాల్ పేపర్ తో అదృష్టాన్ని తెచ్చుకునే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష్య శాస్త్రం. నిత్యం చేతిలో ఉండే మొబైల్ వాల్ స్క్రీన్ పై ఏ వాల్ పేపర్ పెట్టుకుంటే మంచిదో తెలుసుకుందాం. నక్షత్రాల్లో మనకి కార్యసిద్ధి నక్షత్రం ఒకటి ఉంది. జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఆరో నక్షత్రమే కార్యసిద్ధి.

Advertisement

అశ్వని నక్షత్రాన్ని తీసుకుంటే ఆరుద్ర నక్షత్రం ఆరోది అవుతుంది. అష్టమి నక్షత్రం వారికి ఆరుద్ర కార్య సిద్ధి నక్షత్రం అవుతుంది. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన దేవుడ్ని పూజిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్పే మాట. అలా కార్యసిద్ది పాటించిన వారికి రాజయోగం కలుగుతుంది. ఆ దేవుడికి సంబంధించిన వాల్ పేపర్ ను మొబైల్ స్క్రీన్ పై పెట్టుకోవడం ద్వారా ఫలితాలు కలుగుతాయి. భరణి నక్షత్రాన్ని తీసుకుంటే ఆరో నక్షత్రం పునర్వసు అవుతుంది. ఆరో నక్షత్రం ఒకటే కాదు 15, 24న నక్షత్రాన్ని కూడా లెక్కించి పూజలు చేసే కార్యసిద్ది ప్రాప్తిస్తుంది. అశ్వనీ నక్షత్రం వారికి సరస్వతి, భరణి నక్షత్రానికి దుర్గాదేవి, కృత్తిక నక్షత్రం వారిక అర్ధనారీశ్వరుడు, రోహిణి నక్షత్రం వారికి శ్రీకృష్ణుడ్ని పూజించడం ద్వారా కార్యసిద్దిని కలిగిస్తాడు.

జన్మ నక్షత్రం తెలియని వారు నామ నక్షత్రాన్ని అనుసరించివచ్చు. నామ నక్షత్రం నుంచి వచ్చిన ఆరో నక్షత్రమే కార్యసిద్ది నక్షత్రం అవుతుంది. జ్యోతిష్యంలో చెప్పే నక్షత్రాల సంఖ్య 27. సైంటిఫిక్ గా నక్షత్రం కాంతిని వెదజల్లుతుంది అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. కాంతి శక్తి, ఉష్ణశక్తి ఈరెండెంటిని చంద్రుడు తీసుకుని ఆ వ్యక్తికి జీవితమంతా ప్రభావాన్ని చూపిస్తాడు. ఆయా నక్షత్రాల్లో పుట్టిన వారిపై చంద్రుడి ప్రభావం వల్ల ఆలోచనలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. చంద్రుడి బలంతోపాటు రాశి అధిపతి, నక్షత్రాధిపతి సంబంధం మీద ఆధారపడి జాతకం ఉంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×