BigTV English

Astrology: రాశి ఫలాలు.. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని పురోగతి

Astrology: రాశి ఫలాలు.. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని పురోగతి

Astrology today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..రాశి ఫలాలకు ఆదరణ ఉంటుంది. రాశుల ఆధారంగా ఎవరికి కలిసి వస్తుంది. ఎవరికి విజయాలు వరిస్తాయి. మేషం నుంచి మీనం వరకు ఎలా ఉందో తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశి వారికి పనితీరు ఆధారంగా ప్రశంసలు వస్తాయి. సంతోషకంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని అభివృద్ధి సాధిస్తారు.శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ప్రయాణాలు ఉంటాయి. అవసరం ఉన్న సమయాల్లో సహాయం చేస్తారు. విష్ణువుని పూజించాలి.

వృషభం:
ప్రణాళికతో ముందుకు వెళ్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. భాగస్వామితో ఆనందంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మిథునం:

మిథునం రాశివారికి శ్రమతో కూడిన విజయం వరిస్తుంది. అధికార నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల్లో మీ నిర్ణయాలే విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొత్త అనుభవాలు, కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వాదనలు దూరంగా ఉండాలి. లలితాదేవిని పూజించాలి.


కర్కాటకం:
ఈ రాశి వారికి ప్రారంభించన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అయినా ఎదురించి విజయం సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై ప్రాధాన్యత అవసరం. పెద్దల సలహాలతో ముందుకు వెళ్తారు. ఇతరులు బాధకు గురి చేస్తారు. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

సింహం:
వృత్తిపరంగా, వ్యాపారాల్లో మీ నాయకత్వ నైపుణ్యాలకు మంచి గుర్తింపు వస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ది కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఉత్తమం. అధికారల సహకారం ఉంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.

కన్యరాశి:
ఈ రాశి వారికి అనకూలంగా ఉంది. బలమైన నిర్ణయాలతో విజయం సాధిస్తారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మానసిక ప్రశాంతత అవసరం. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు ఉంటాయి. కోపం తగ్గించుకోవాలి. శివుడిని పూజించడం ఉత్తమం.

తుల రాశి:
తుల రాశి వారికి అనుకూలం. అవసరాలు ఉంటాయి. భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అధికారుల సహకారం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆదరాభిమానులు ఉంటాయ. ఇష్టదైవాన్ని పూజించాలి.

వృశ్చికం:
మనోబలం అవసరం. వృత్తి పరంగా మీ సంకల్పం, ఆశయం విజయానికి దారితీయవచ్చు. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవాలి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి.

ధనస్సు
ఈ రాశి వారికి అనుకూలం. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ప్రశంసలు ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనోధైర్యం అవసరం. కనకధారస్తవం చదవాలి.

మకరం:
వృత్తిపరంగా క్రమశిక్షణ, అంకితభావం విజయానికి దారి తీస్తాయి. మానసికంగా బలంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. నమ్మకం, నిబద్ధత అవసరం. పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

కుంభం:
ఈ రాశి వారికి అనుకూలం.పట్టుదలతో విజయం సాధిస్తారు. సంతోషకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. కొత్త ఆలోచనలతో ముందుకెళ్లండి. మనోబలం పెరుగుతుంది. విష్ణు ధ్యానం చేయాలి.

మీనం:
మీన రాశి వారికి విఘ్నాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. చంచల బుద్ధి ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆత్మపరిశీలన అవసరం. పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రీహరిని ఆరాధించాలి.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×