Intinti Ramayanam Today Episode October 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ బిజినెస్ చేసుకోవడానికి లోన్ తీసుకొచ్చినట్లు రాజేంద్రప్రసాద్ అందరితో చెప్తాడు. అయితే ఆ మాట వినగానే అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు కానీ శ్రియ మాత్రం మీకు బావగారు ఒక్కరే కొడుకా మిగతా ఇద్దరు కొడుకులు కి కూడా మీరు సమానంగా డబ్బులు ఇవ్వాలి కదా అని అడుగుతుంది. మీరు ఒకలాగా కొడుకుని ఒకలాగా మిగతా ఇద్దరి కొడుకుల్ని ఒకలాగా చూస్తున్నారు అని కడిగి పడేస్తుంది. అవని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడకు అందరినీ నీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నావు అంటూ శ్రీయ అంటుంది. రాజేంద్రప్రసాద్ ఎవరికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అంటాడు. కానీ శ్రియ మాత్రం అత్తయ్య మీకు బావగారు సొంత కొడుకు కాదు అని చెప్పారు కదా.. అలాంటిది అతని మీద మీరు ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? మిగతా ఇద్దరు కొడుకుల్ని ఎందుకు సరిగ్గా చూసుకోవడం లేదు అని అడుగుతుంది. ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం రాజేంద్రప్రసాద్ అవని ఇద్దరూ కలిసి డబ్బులు తీసుకొని వస్తారు. అక్షయ్ నిపించి అందరి ముందర ఆ డబ్బులని ఇవ్వాలని రాజేంద్రప్రసాద్ అనుకుంటాడు.. అక్షయ్ రాగానే ఆ డబ్బులు ఇచ్చి బిజినెస్ కి ప్లాన్ చేసుకోమని రాజేంద్రప్రసాద్ సలహా ఇస్తాడు. ఈ డబ్బులు నీ ముందు లోపల పెట్టు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయితే శ్రీయా మాత్రం మీరేం చేసినా అడిగే హక్కు మాకు లేదని అంటున్నారు ఆ మావయ్య అని మళ్ళీ రచ్చ చేస్తుంది. అక్షయ్ ని కూడా శ్రీయా అడుగుతుంది.. ఏం జరిగినా సరే అక్షయ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు.
మీరు ఉమ్మడి ఆస్తిని ముగ్గురి కొడుకులకి సమానంగా పంచాలి కానీ ఇలా ఒక కొడుకుకి ఇచ్చి మిగతా ఇద్దరు కొడుకులు కి ఇవ్వకుండా ఉంటారని పెద్ద గొడవే చేస్తుంది. ఒకవైపు అవని ఎంతగా చెబుతున్నా సరే శ్రియ మాత్రం డబ్బుల కోసం అందరిపై విరుచుకుపడుతుంది. మీరు కూడా స్వార్ధాన్ని చూసుకుంటున్నారా బావగారు మీ తమ్ముళ్ళకి మీరు ఆ డబ్బులు ఎందుకు పంచ లేక పోతున్నారు అని అడుగుతుంది. ఇక ఆ మాట వినగానే అవని రెచ్చిపోతుంది.
మా ఆయన స్వార్థపరుడు అని అంటున్నావు కదా అంతా స్వార్థపరుడే అయితే రోడ్లు పట్టుకొని ఉద్యోగం కోసం తిరగడు. అంత స్వార్ధపరుడు అయితే ఎప్పుడో కోట్లు కూడా పెట్టి తన అకౌంట్లో వేసుకునేవాడు. అంత స్వార్థపరుడు అయితే మీరందరూ లగ్జరీ హౌస్ లో ఉంటే ఆయన మాత్రం చిన్న అద్దె ఇంట్లో ఉన్నారు . ఇది ఆలోచించువా నువ్వు అని శ్రేయని అవని అడుగుతుంది. అక్షయ్ శ్రీయా అడిగిన దాంట్లో తప్పేముంది.. నా తమ్ముళ్ళ గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. ఈ డబ్బులు తీసుకుని మీ అందరి చేత మాటలు పడుతుంది కూడా మంచి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి నా తమ్ముళ్ళని బాగా చూసుకుంటాను అని అక్షయ్ అంటాడు.
ఆ తర్వాత కమల్ శ్రీకర్ పై గొడవకు దిగుతాడు. నీ భార్య అన్ని మాటలు అంటుంటే నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావా..? అమ్మ నాన్నల్ని తిడుతున్న సరే నువ్వు చూస్తూ ఉండిపోయావు ఆ మాత్రం నీ భార్య నువ్వు కంట్రోల్ చేసుకోలేవు అని కమల్ అడుగుతాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. మధ్యలో రాజేంద్రప్రసాద్ వెళ్లి వాళ్ళని కంట్రోల్ చేసి లోపలికి వెళ్ళిపొమ్మని చెప్తాడు. చూసావా అమ్మ ఆ డబ్బులు నేను ఇచ్చాను అంటే ఇంత గొడవ జరిగింది. నువ్వే ఆ డబ్బులు తెచ్చావని అందరికీ తెలియాలి అని అవనితో రాజేంద్రప్రసాద్ అంటాడు.
ఇదంతా అవని ప్లానని పల్లవి అనుకుంటుంది. ఆ తర్వాత భరత్ ని తీసుకొని పల్లవి బయటకు వెళుతుంది. అయితే అక్కడ భరత్ కి వాళ్ల నాన్న డబ్బులు ఇవ్వాలని రమ్మన్నట్లు చెబుతుంది.. నువ్వు నేను కలిసి ఉండటం చూస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారు. ఈ డబ్బు నీకు ఎలా వచ్చాయి అంటే ఎక్కడ నిజం చెప్పకు అని పల్లవి మాట తీసుకుంటుంది. భరత్ నీ బస్టాండ్ లో వెయిట్ చేయమని చెప్తుంది. అవని ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడ గీత కావాలనే అవని రెచ్చగొడుతుంది.
Also Read : రోహిణి ప్లాన్ ఫెయిల్.. శృతికి తెలిసిన నిజం..ఇంట్లో రచ్చ చేసిన ప్రభావతి..
గీత మాటలు విన్న అవని సారీ మేడం ఏమనుకోకండి అని గీత చెంప పగలగొడుతుంది. మా ఇద్దరి మధ్య గొడవలు పెరగడానికి కారణం ఆమె.. వేరే వాళ్ళకి తొత్తుగా పని చేస్తూ ఇక్కడ గొడవలు గురించి చెప్తుంది గొడవలు పెడుతుంది అని అనగానే అవని వాళ్ళ బాస్ కూడా గీత చెంప పగలగొడుతుంది. ఇక భరత్ ని చూసిన చక్రధర్ తన ఫ్రెండ్ ని పంపించి డబ్బులు ఇవ్వమని చెప్తాడు. అయితే ఆ డబ్బులను ఇవ్వడానికి చక్రధర్ రాలేదా అని అడుగుతాడు భరత్. ఈ డబ్బులు నీకు ఇచ్చిన తర్వాత ఎవరికీ చెప్పదని ఆయన అన్నారు ఆయన కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు అని ఆ వచ్చిన వ్యక్తి అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అక్షయ్ దగ్గర ఉన్న డబ్బులు మాయమైపోతాయి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..