Brahmamudi serial today Episode: అబార్షన్ టాబ్లెట్ కలిపిన జ్యూస్ గ్లాస్ రాజ్ కిచెన్‌లో అలాగే వదిలేసి వెళ్లిపోతాడు. తర్వాత కిచెన్‌లోకి వెళ్లిన కావ్య గ్లాస్ చూసి అనుమానిస్తుంది. సందీప్‌కు కాల్ చేసి ఆ జ్యూస్‌లో ఏం కలిపారో తెలుసుకోవాలనుకుంటుంది. అలాగే కాల్ చేస్తుంది. సందీప్ పంపించండి మేడం టెస్ట్ చేసి చెప్తాను అంటాడు. కావ్య జ్యూస్ పంపిస్తుంది. తర్వాత సదీప్ ఇంకా ఫోన్ చేయలేదేంటి అని ఎదురుచూస్తుంది. ఇంతలో ఇంద్రాదేవి వచ్చి కావ్య ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు బామ్మ సందీప్‌కు ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్తుంది. ఇంతలో సందీప్ కాల్ చేస్తాడు. కాల్ లిప్ట్ చేసి హలో చెప్పండి అని అడుగుతుంది కావ్య.. ఏంటి మేడం ఏం చెప్పాలి.. అంటాడు సందీప్.. ఎందుకు ఏమైంది..? అని కావ్య అడగ్గానే..
అందులో ఏం కలిపారో తెలుసా..? అబార్షన్ టాబ్లెట్ కలిపారు.. డౌటు వచ్చి మళ్లీ టెస్ట్ చేశాను.. ఆ జ్యూస్‌లో ఎవరో కావాలనే ఆ టాబ్లెట్ కలిపారు. జాగ్రత్తగా ఉండండి మేడం అంటూ సందీప్ కాల్ కట్ చేస్తాడు. సరే అంటూ.. అంటే కచ్చితంగా ఆ టాబ్లెట్ కలిపింది ఆయనే.. అందుకే నేను జ్యూస్ పని మనిషిని అడిగితే ఆయన తీసుకొచ్చారు.. పైగా నేను తాగను అంటే తాగమని బలవంతం చేశారు. ఆయన నిజంగా బిడ్డ వద్దనుకుంటే.. ఆయన జ్యూస్ నాకు ఇచ్చి అబార్షన్ అయ్యేటట్లు చేసుండాలి. కానీ ఎందుకు ఇలా ఆగిపోయి ఉంటారు.
చివరి నిమిషంలో ఆ గ్లాస్ ఎందుకు మార్చి ఉంటారు. అలా అబార్షన్ అయ్యేలా చేస్తే.. నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఆగిపోయారా..? లేక ఇంకేమైనా అవుతుందని ఆగిపోయారా..? ఎలా తెలుసుకోవాలి.. ఆ రోజు హాస్పిటల్ లో కూడా ఆ డాక్టర్‌ను కూడా ఏదో రిక్వెస్ట్ చేశారు. ఆయన అబార్షన్ చేయించడానికి కారణం ఆ డాక్టర్‌కు తెలిసి ఉంటుంది. రేపే డాక్టర్‌ను కలిసి ఆ నిజం ఏంటో తెలుసుకోవాలి కానీ ఆయన ఇంట్లో ఉండే నేను ఎలా హాస్పిటల్‌కు వెళ్లగలను.. అని మనసులో అనుకుని ఇంద్రాదేవిని ఒక హెల్ఫ్ చేయమని అడుగుతుంది. రేపు ఆయన మన ఫార్మ్ హౌస్ కు వెళ్లేలా చేస్తే.. నేను ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుంటాను అని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి సరే అంటుంది.
అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయమే ఇంద్రాదేవి ప్లాన్ ప్రకారం ఫామ్ హౌస్‌కు పంపిస్తుంది. కావ్య ఇక డాక్టర్ దగ్గరకు వెళ్లాలి అనుకుంటుంది. మరోవైపు స్వప్న కిచెన్‌లో ఉండగా.. దూరం నుంచి చూసిన రాహుల్.. మమ్మీ చెప్పిందంతా గుర్తు ఉంది కదా..? నువ్వు నన్ను తిట్టే తిట్లకు స్వప్న పూర్తిగా నేను మారిపోయాను అని నమ్మేయాలి అంటాడు. చెప్పావు కదా రాహుల్.. ఇక నేను చూసుకుంటాను నువ్వు వెళ్లు. వెళ్లి అవార్డు విన్నింగ్ ఫర్మామెన్స్ అంటే ఏంటో చూపించేయ్.. నేను కూడా వస్తాను అని చెప్తుంది. దీంతో రాహుల్ కిచెన్‌లోకి వెళ్లి స్వప్న నువ్వు చేసిన అన్ని పనులు చేశాను.. అని చెప్తుండగానే.. స్వప్న సారీ రాహుల్ ఇన్ని రోజులు నువ్వు ఏ పని పాటా లేకుండా గాలి తిరుగుడులు తిరుగుతుంటే తిట్టుకునే దాన్ని కానీ నువ్వు ఇంత బాగా బాధ్యతలు తీసుకుని పనులు చేస్తుంటే.. నాకు ముచ్చటేస్తుంది అంటుంది.
ఇంతలో అక్కడికి వచ్చిన రుద్రాణి కానీ నాకు మాత్రం చచ్చిపోవాలనిపిస్తుంది అంటుంది. అయితే చచ్చిపోండి ఎవరు వద్దన్నారు అంటుంది స్వప్న.. ఓసేయ్ వాడేమన్నా నీకు బానిస అనుకున్నావా..? వాడి చేత చేయకూడని పనులు చేయిస్తున్నావు.. అని అడగ్గానే.. మామ్ పనులు నేనే చేస్తే తనను అంటావేంటి..? ఆ పనులు నేనే చేస్తానని చెప్పాను అందులో తన తప్పు ఏం ఉంది అంటాడు రాహుల్. నీ పెళ్లాం తప్పేం లేదురా..? నిన్ను కనడమే నా తప్పు.. అంటుంది. దీంతో రాహుల్ కోపంగా రుద్రాణిని తిడతాడు.. భర్త అంటే భార్యను కష్టపెట్టేవాడు కాదు.. మామ్ తన కష్టాన్ని పంచుకునే వాడు అంటూ రాహుల్ చెప్పగానే స్వప్న కూడా రుద్రాణిని తిడుతుంది.
తర్వాత కళ్యాణ్ వచ్చి రాజ్ కనిపించడం లేదేంటి అని అడుగుతాడు. పొద్దున్నే అమ్మమ్మ ఎక్కడికో పంపింది అని చెప్పగానే.. కావ్య వదిన ఎక్కడికి వెళ్లింది అని అడగ్గానే..తను హాస్పిటల్‌కు వెళ్లింది అని చెప్పగానే కళ్యాణ్ కంగారుగా బయటకు వెళ్లి రాజ్ కు కాల్ చేసి విషయం చెప్పగానే.. రాజ్ మధ్యలోంచే యూటర్న్ తీసుకుని కావ్యను ఆపేందుకు వెళ్తుంటాడు. తాను హాస్పిటల్ కు వెళ్లే లోపే కావ్య డాక్టర్‌ను కలుస్తుందని డాక్టర్‌కు ఫోన్ చేసి కావ్యకు నిజం చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తాడు. డాక్టర్ తాను అబద్దం చెప్పలేనని చెప్తుంది. దీంతో రాజ్ సిస్టర్ శాంతికి కాల్ చేసి ఎలాగైనా తాను అక్కడికి వెళ్లే వరకు కావ్య, డాక్టర్ ను కలవకూడదని రిక్వెస్ట్ చేస్తాడు. శాంతి సరే అంటుంది. వెంటనే వెళ్లి డాక్టర్ దగ్గరకు వెళ్లబోతున్న కావ్యను ఆపేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.