Philippines: ఫిలిప్పీన్స్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఒకటీ రెండు కాదు.. ఏకంగా వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక భవనాలు భారీగా డ్యామేజ్ అయ్యాయి. చాలా ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోలేని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.
ఫిలిప్పీన్స్ ప్రకృతి కన్నెర్ర
ఫిలిప్పీన్స్‌పై ప్రకృత తన ప్రతాపం చూపింది. నిమిషాల వ్యవధిలో వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9, 7.0, 7.0 వచ్చినట్టు అమెరికా జియాలాజికల్ సర్వే పేర్కొంది. దీంతో అలర్టయిన అక్కడి ప్రభుత్వం.. లేటె, సెబు, బిలిరాన్ తీర ప్రాంతాల ప్రజలను హెచ్చరించింది. అంతేకాదు సునామీ వచ్చే అవకాశముందని హెచ్చరించింది.
అమెరికా జియోలాజికల్ సర్వే వివరాలు మేరకు ద్వీపం యొక్క ఉత్తర చివరలో ఉంటుంది బోగో నగరం. 90 వేల మంది జనాభా కలిగిన నగరంలో తొలుత మంగళవారం రాత్రి దాదాపు 10 గంటల భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో 19 మంది మృతి చెందారు. భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడినట్టు స్థానికులు చెబుతున్నారు. చాలామంది గల్లంతు అయ్యారు.
వణికిన వంతెనలు, భయంతో
మరో భూకంపం బోహోల్ ప్రావిన్స్‌లోని కాలాపే ప్రాంతానికి తూర్పు-ఆగ్నేయంగా 11 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. ఈ పట్టణంలో దాదాపు 33 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ కూడా డ్యామేజ్ వివరీతంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళ సహాయక చర్యలు చేయడానికి ఆటంకాలు ఎదురయ్యాయి.
ALSO READ: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా
భూకంపం ధాటికి బంటయాన్ ప్రాంతంలో ఫేమస్ చర్చి ధ్వంసం అయ్యింది. భూకంపం దాటికి చర్చి చుట్టూ ఉన్న విద్యుత్ వైర్లు, లైట్లు పడిపోయాయి. ఆ తర్వాత చర్చి భారీగా డ్యామేజ్ అయ్యింది. చర్చి పరిసరాల్లోని ప్రజలు ఆర్తనాదాలతో ఒక్కసారిగా పరుగులు తీశారు.
అలాగే సెబు ప్రాంతంలో భారీ వంతెన వణికింది. అదే సమయంలో వంతెనపై వాహనదారులు వెళ్తుండగా వెంటనే ఆగిపోయారు. వాహనాలు దిగి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాత్రికి రాత్రికే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. రోడ్లు డ్యామేజ్ కావడంతో విద్యుత్ లేకపోవడంతో సహాయకచర్యలకు ఆటంకం ఏర్పడింది.
రాత్రంతా ఆయా ప్రాంతాల ప్రజల రోడ్ల మీద బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఇప్పుడిప్పుడే నష్టాన్ని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్స్ లో భూకంపాలు సర్వ సాధారణం. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం కూడా ఆ ప్రాంతంలో తరచూ జరుగుతాయి.
🚨A magnitude 6.9 #earthquake destroyed a #Catholic church in the Philippines, according to media reports.
The tremors were felt most strongly on the island of #Cebu.
There are no casualty reports yet. Footage is being shared on social media. pic.twitter.com/FBkGiA4277
— News.Az (@news_az) September 30, 2025
Pray for Philippines 🇵🇭 🙏 #EarthquakePH #earthquake pic.twitter.com/RyrNWeVWBI
— Joel Marie (@jmriegodedios) September 30, 2025